న్యూస్

1st వీక్ లో 270….2nd వారంలో పెళ్లి సందD మెంటల్ మాస్ థియేటర్స్ కౌంట్….భీభత్సం ఇది!

దసరా బరిలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన సినిమా పెళ్లి సందD, రిలీజ్ అయినప్పుడు తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయినా ఈ సినిమా కి ఈ థియేటర్స్ కూడా ఎక్కువే అనుకున్నారు అందరూ… కానీ ఫస్ట్ వీక్ లోనే ఆల్ మోస్ట్ బిజినెస్ ను క్రాస్ చేసిన ఈ సినిమా రెండో వారం లో థియేటర్స్ ని…

సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. రిలీజ్ అవ్వడం 270 థియేటర్స్ లో రిలీజ్ అయితే రెండో వారంలో ఒక్క నైజాంలోనే సినిమా 174 థియేటర్స్ లో రన్ అవుతుండగా సీడెడ్ ఏరియాలో 80 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక ఆంద్ర రీజన్ కి గాను…

170 వరకు థియేటర్స్ లో రెండో వారాన్ని సాగిస్తున్న ఈ సినిమా టోటల్ గా 2 వ వారం తెలుగు రాష్ట్రాలలో 425 థియేటర్స్ లో రన్ అవుతుంది, అంటే ఫస్ట్ వీక్ తో పోల్చితే రెండో వారం థియేటర్స్ తగ్గాల్సింది పోయి ఏకంగా 155 థియేటర్స్ ని పెంచుకుని ఊచకోత అనే ఇది అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసింది ఈ సినిమా… ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment