న్యూస్ బాక్స్ ఆఫీస్

1st వీక్ లో 530….2nd వారంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేటర్స్ కౌంట్…సెన్సేషన్ ఇది!!

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మొదటి వారాన్ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు రెండో వారంలో ఎంటర్ అవ్వగా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా రెండో వారంలో సెన్సేషన్ అనిపించే రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసి సత్తా చాటుకుంది. సినిమా రిలీజ్ రోజున సుమారు 530 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను ఓవరాల్ గా సొంతం చేసుకోగా…

రెండో వారంలో హోల్డ్ చేసిన థియేటర్స్ ని గమనిస్తే… నైజాం లో రెండో వారంలో 194 థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 90 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది. ఇక ఆంధ్ర రీజన్ లో 200 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి దుమ్ము లేపింది ఈ సినిమా….

దాంతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 2 వ వారంలో ఆల్ మోస్ట్ 485 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. అంటే కేవలం 45 థియేటర్స్ ని మాత్రమె రెండో వారంలో కోల్పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో వీక్ లో టోటల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Leave a Comment