న్యూస్ బాక్స్ ఆఫీస్

1st వీక్ లో 565…2nd వారంలో సీటిమార్ థియేటర్స్ కౌంట్….సెన్సేషన్ ఇది!!

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వారాన్ని మంచి వసూళ్ళతోనే ముగించింది ఈ సినిమా… రిలీజ్ అవ్వడం మంచి టాక్ తోనే రిలీజ్ అవ్వగా బాక్స్ అఫీస్ దగ్గర నైజాం కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినా కానీ ఓవరాల్ గా డీసెంట్ వీక్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో వారాన్ని మొదలు పెట్టగా…

రెండో వారం లో చాలా కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయ్యింది కానీ ఈ సినిమా సెన్సేషన్ అనిపించే రేంజ్ లో థియేటర్స్ ని రెండో వారం హోల్డ్ చేయడం విశేషం. సినిమా రిలీజ్ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 565 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా…

రెండో వారానికి గాను కేవలం 200 కి పైగానే థియేటర్స్ ని కోల్పోయింది. నైజాంలో 136 థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రలో 210 థియేటర్స్ లో రెండో వారంలో పరుగును కొనసాగిస్తుంది. టోటల్ గా 345 థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం కూడా మంచి వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment