న్యూస్ బాక్స్ ఆఫీస్

1st వీక్ సరిలేరు నీకెవ్వరు తమిళ్ డబ్ కలెక్షన్స్…2nd వీక్ థియేటర్స్ కౌంట్ ఇదే!!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లితెరపై కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన తర్వాత రిలీజ్ అయిన 10 నెలల తర్వాత రీసెంట్ గా తమిళ్ లో డబ్ అయ్యి రిలీజ్ అయిన విషయం తెలిసిందే, కాగా సినిమా కి తమిళ్ లో కూడా మంచి టాక్ ఆడియన్స్ నుండి…

లభించగా సినిమా కి కోవిడ్ తర్వాత పరిస్థితుల నేపధ్యంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ అక్కడ సొంతం అయ్యాయి అని చెప్పొచ్చు. మొదటి రోజు 10లక్షల రేంజ్ గ్రాస్ ని వీకెండ్ లో 20 లక్షల వరకు గ్రాస్ ని వసూల్ చేసిన ఈ సినిమా… 5 రోజులు పూర్తీ అయ్యే సరికి…

30 లక్షల వరకు గ్రాస్ తో బాగా హోల్డ్ చేయగా ఇప్పుడు మొదటి వారం పూర్తీ అయ్యే సరికి 38 లక్షల గ్రాస్ ని అక్కడ వసూల్ చేసి బాగానే హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది, ఇక సినిమా సాధించిన బిజినెస్ గురించి క్లియర్ అవ్వగా అక్కడ సినిమాను థియేటర్స్ లో…

పెర్సేంటేజ్ బేస్ తో రిలీజ్ చేశారు, వచ్చిన డబ్బు లో నిర్మాతలు థియేటర్ ఓనర్లు పంచుకోబోతున్నారట… నిర్మాతలకు తమిళ్ డబ్ శాటిలైట్ రైట్స్ నుండి లాభం దక్కబోతుందని సమాచారం. ఇక మొత్తం మీద మొదటి వారం 38 లక్షల గ్రాస్ ని వసూల్ చేసిన సినిమా కి అందులో నుండి 20 లక్షల దాకా షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమా రిలీజ్ అవ్వడం…

220 వరకు థియేటర్స్ లో అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా ఇప్పుడు రెండో వారానికి వచ్చే సరికి సినిమా 200 వరకూ థియేటర్స్ ని అలాగే హోల్డ్ చేసి రెండో వారాన్ని కొనసాగిస్తుందని సమాచారం. అంటే ఇప్పుడు రెండో వీక్ లో కూడా సినిమా ఇలానే స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేయవచ్చు.

Leave a Comment