గాసిప్స్ న్యూస్

1st సినిమాకే జాక్ పాట్ కొట్టిన యాంకర్ ప్రదీప్…రెమ్యునరేషన్ ఎంత వచ్చిందో తెలిస్తే షాక్!

టాలీవుడ్ టెలివిజన్ లో సూపర్ పాపులర్ యాంకర్ అయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందిన ఫస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా…. ఎప్పుడో షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాస్ట్ ఇయరే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ కరోనా వలన సినిమా పోస్ట్ పోన్ అవుతూ రాగా డిజిటల్ రిలీజ్ కి సినిమాకి మంచి ఆఫర్లు వచ్చినా కానీ నో చెబుతూ వచ్చిన టీం సినిమా ను ఎలాగైనా ఆడియన్స్ ముందుకు తేవలాని…

ట్రై చేసి ఎట్టకేలకు రీసెంట్ గా సినిమాను ఆడియన్స్ ముందుకు సంక్రాంతి తర్వాత తీసుకువచ్చారు. కాగా సినిమా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగించి బాక్స్ అఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది… ఇక ఈ సినిమా కి గాను యాంకర్ ప్రదీప్ కి దక్కిన రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారగా…

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ ని ప్రదీప్ తీసుకోలేదని వెల్లడించారు, కానీ సినిమా ఓవరాల్ ప్రాఫిట్ లో షేర్ తీసుకోబోతున్నారని ట్రేడ్ లో టాక్ చక్కర్లు కొడుతుంది. సినిమా కి రెమ్యునరేషన్ తీసుకోకుండా అనుకున్న బడ్జెట్ మొత్తాన్ని సినిమా…

నిర్మాణానికే వాడారు. ఓవరాల్ బడ్జెట్ మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ జరిగింది. ఇక సినిమా ఓవరాల్ గా బిజినెస్ లెక్కలు 10 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో నుండి ప్రదీప్ కి 30% వరకు వెళుతుందని అంటున్నారు.. అంటే టోటల్ బిజినెస్ యాంకర్ ప్రదీప్ కి 3 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ మొత్తం మీద దక్కింది అని చెప్పొచ్చు. ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ హీరోలు తీసుకునే రేంజ్ ఇది… ఇది నిజంగానే సాలిడ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి.

కొత్త హీరో కి ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు, ఒకవేళ 30% అందకున్నా 20 – 25% వెళ్ళినా కూడా 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ పక్కాగా సొంతం అవుతుంది. మొదటి సినిమాతోనే జాక్ పాట్ కొట్టిన ప్రదీప్ బాక్స్ ఆఫీస్ విజయం తో పాటు నటుడిగా మంచి పేరు ని కూడా సొంతం చేసుకోవడం విశేషం..

Leave a Comment