న్యూస్ బాక్స్ ఆఫీస్

ఫస్ట్ డే 52.75 కోట్లు…రికార్డ్ ముక్క మిగల్లేదు

బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేసింది. ఊహించన లెక్క కి మించి వసూళ్ల లో భీభత్సం సృష్టించి ఏకంగా ఇండియన్ సినిమాల హిస్టరి లోనే మొదటి రోజు అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ సినిమా గా అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా.

సినిమా మొదటి రోజు హిందీ వర్షన్ కి గాను టోటల్ ఇండియా లో 50.75 కోట్ల నెట్ వసూళ్ల ని సాధించి చారిత్రక రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక తమిళ్ మరియు హిందీ వర్షన్స్ కలుపుకుని టోటల్ గా సినిమా మొదటి రోజు కి గాను 52.75 కోట్ల నెట్ వసూళ్లని…

మొదటి రోజు సాధించింది. దీపావళి హాలిడే ఓ రేంజ్ లో హెల్ప్ అవ్వగా మొదటి రోజు అంచనాలకు మించి కలెక్షన్స్ ని సాధించి చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది.

Leave a Comment