న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

2 ఇయర్స్ లో 7 హిట్లు…ఈ హీరో తోపు తురుం ఖాన్!!

ప్రస్తుతం ఉన్న కథల కొరతలు ఎలాంటివో అందరికీ తెలిసిందే, మంచి కథ ఆడియన్స్ కి నచ్చుతుందని చేస్తే అది ప్రేక్షకులను అలరించడం లో విఫలం అవుతుంది, కొన్ని సినిమాలు మాత్రమె ఆకట్టుకుంటున్నాయి. 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో 15 నుండి మహా అయితే 20 సినిమాలు మాత్రమె హిట్ అవుతున్నాయి. అంతలా పడిపోయిన హిట్ రేంజ్ లో కూడా ఒక హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర గత రెండు ఏళ్లుగా వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.

ఆ హీరో ఎవరో స్టార్ కూడా కాదు, యంగ్ హీరో నే అయినా వరుస పెట్టి హిట్స్ తో ఇప్పుడు స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్నాడు, అతనే ఆయుష్ మాన్ ఖురానా… ఈ హీరో కెరీర్ బాగానే మొదలు పెట్టినా మధ్యలో కొన్ని ఫ్లాఫ్స్ వచ్చాయి.

అయినా కానీ రెండేళ్ళ క్రితం నుండి ఇప్పటి వరకు ఒకటి తర్వాత ఒకటి డిఫెరెంట్ మూవీస్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకుంటూ దూసుకు పోతున్నాడు… వరుసగా బరేలీ కి బర్ఫీ, శుభ్ మంగళ్ సావ్దాన్, అందా దూన్, బదాయ్ హో, ఆర్టికల్ 15, డ్రీం గర్ల్ సినిమాలు…

హిట్ అయ్యి వరుసగా 6 సినిమాలతో డబుల్ హాట్రిక్ బాలీవుడ్ హీరోగా సంచలనం సృష్టించిన ఆయుష్ మాన్ ఖురానా రీసెంట్ గా చేసిన బాలా సినిమా కూడా హిట్ అయ్యి ఆల్ మోస్ట్ 70 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ట్రిపుల్ హాట్రిక్ వైపు మొదటి అడుగు సాలిడ్ గా వేసింది.

బట్టతల వల్ల కాన్ఫిడెంట్స్ కోల్పోయే వాళ్ళ కోసం కలర్ మార్చే క్రీమ్స్ అంటూ మార్కెట్ లో దొరికే ఆయింట్ మెంట్స్ గురించి కామిక్ గా తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించి 100 కోట్ల వైపు దూసుకు పోతుంది, ఈ సినిమా బాలీవుడ్ లో నాన్ స్టాప్ గా 7 హిట్లు కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా మారాడు ఈ హీరో.

Leave a Comment