గాసిప్స్ న్యూస్

2 చోట్ల ఊసే లేదు…కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 2 కే గురి పెట్టారు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పరుగును మధ్యలోనే ఆపాల్సి వచ్చినా కానీ సినిమా ఉన్న టైం లోనే అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, ఇక సినిమా తర్వాత మూడు వారాలకే డిజిటల్ లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకు పోతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఒరిజినల్ వర్షన్ తో అలాగే ఫస్ట్ రీమేక్ అయిన తమిళ్ వర్షన్ లతో సినిమాను కంపేర్ చేస్తూ మనదే కమర్షియల్ టచ్ అండ్ ఆడియన్స్ కి ఎక్కువగా రీచ్ అయ్యింది అంటూ ప్రతీ ఒక్కరు చెబుతూ ఉండగా ఇప్పుడు సడెన్ గా మరో న్యూస్ పై కూడా…

చర్చలు గట్టిగా జరుగుతూ ఉన్నాయి. పింక్ పాయింట్ కి ఒక పార్ట్ ఎక్కువ కానీ లాయర్ రోల్ కి మరో సినిమా ఇచ్చే అవకాశం గురించి ఏ డైరెక్టర్ కూడా ఆలోచించలేదు, పింక్ మూవీ కానీ తమిళ్ రీమేక్ పై కానీ ఎవ్వరూ రెండో పార్ట్ గురించి అసలు తమ ఒపినీయన్ ని కూడా చెప్పలేదు.

కానీ ఆ రెండు చోట్ల జరగనిది ఇప్పుడు తెలుగు కి వచ్చే సరికి జరిగేలా కనిపిస్తుంది అని చెప్పాలి. డైరెక్టర్ వేణు శ్రీ రామ్ సోషల్ మీడియా లో మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ కథ పై కూడా పనులు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే వకీల్ సాబ్ 2 కూడా ఉండే అవకాశం ఉందీ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్…

దాంతో ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్ కి సీక్వెల్ అంటే ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో బిగ్ ఇష్యూ మీద ఈ సీక్వెల్ ని ప్లాన్ చేసి తీస్తే కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు కాకున్నా ఫ్యూచర్ లో ఈ సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment