న్యూస్

2 నిమిషాలలో ఇండియా…4 నిమిషాల్లో వరల్డ్ వైడ్…ప్రభాస్ ఫ్యాన్స్ ఊరమాస్!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ 20 అప్ డేట్ వచ్చేసింది. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా యువి క్రియేషన్స్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా సినిమా కి జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ చేస్తున్న సినిమా విషయం తెలిసిందే, సినిమా కి జాన్, ఓ డియర్ మరియు రాధే శ్యామ్ అనే టైటిల్స్ ని ముందు అనుకుని…

ఫైనల్ గా ఇందులో రాదే శ్యామ్ ని కన్ఫాం చేసి సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని చాలా గ్యాప్ తర్వాత ఊరించి ఊరించి రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ఇలా రిలీజ్ చేశారో లేదో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ దుమ్ము లేపే రేంజ్ లో ట్రెండ్ చేస్తూ దూసుకు పోతున్నారు.

వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ ఇలా రిలీజ్ చేశారో లేదో సోషల్ మీడియా లో కేవలం 2 నిమిషాల్లో నే ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ఫస్ట్ లుక్ వరల్డ్ వైడ్ గా కూడా…

కేవలం 4 నిమిషాల టైం మాత్రమే తీసుకుని ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది. ఇక గంటలోనే రాధే శ్యామ్ టైటిల్ పై ట్విట్టర్ లో 5 లక్షల 60 వేల రేంజ్ లో ట్వీట్స్ పోల్ అవ్వగా ఓవరాల్ గా ఇతర హాష్ టాగ్స్ అన్నీ చూసుకుంటే 8 లక్షల రేంజ్ లో ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం….

ఇక ఫస్ట్ లుక్ కానీ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ లో మహేష్ సర్కారు వారి పాట ట్రెండ్ 24 గంటల్లో 4.4 మిలియన్ ట్వీట్స్ పోల్ అవ్వగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడమే ధ్యేయంగా దూసుకు పోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి 24 గంటలు ముగిసే లోపు ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తారో చూడాలి..

Leave a Comment