న్యూస్

2 నిమిషాల్లో ఇండియా…3 నిమిషాల్లో వరల్డ్ వైడ్…రెబల్ స్టార్ వీరంగం ఇది!!

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత సాహో సినిమాతో తన సత్తా చాటుకున్నాడు, ఫ్లాఫ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు రాధే శ్యామ్ తో రాబోతున్న ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమాను తర్వాత ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాను కన్ఫాం చేసి ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇవ్వగా…

ఇప్పుడు వాటితో పాటు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని ఊరమాస్ మూవీ ని KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ అనే మాస్ మూవీ అనౌన్స్ మెంట్ తో మరో లెవల్ కి క్రేజ్ పెరిగేలా చేశాడు, ఎదో జస్ట్ అనౌన్స్ మెంట్ వస్తుంది అనుకుంటే ఏకంగా ఫస్ట్ లుక్ ని…

అలాగే టైటిల్ ని కూడా కన్ఫాం చేసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. ఇక ఇలా అనౌన్స్ మెంట్ వచ్చిందో లేదో రెండు నిమిషాల్లోనే ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపిన ఈ ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్….

వరల్డ్ వైడ్ గా 3 నిమిషాల టైం లోనే ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టి దుమ్ము దుమారం చేసింది, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటికి మించి ఒకటి భారీ మూవీస్ అప్ డేట్స్ రావడం తో ఓ రేంజ్ లో ఖుషీ లో ఉన్నారని చెప్పాలి. ఈ నాలుగు సినిమాల్లో ముందుగా రాధే శ్యామ్ రిలీజ్ కన్ఫాం అవ్వగా మిగిలిన సినిమాల్లో…

ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ సినిమా ముందు వస్తుంది లాంటి విశేషాలు తెలియాల్సి ఉన్నాయి, టాలీవుడ్ లో ప్రజెంట్ వినిపిస్తున్న స్ట్రాంగ్ టాక్ ప్రకారం చూసుకుంటే 2021 లో ప్రభాస్ 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేసే అవకాశం అయితే ఎంతైనా ఉందని అంటున్నారు. మరి ఇది నిజం అవుతుందో కాదో చూడాలి మరి.

Leave a Comment