గాసిప్స్ న్యూస్

2 బాక్ టు బాక్ ఫ్లాఫ్స్…అయినా మేస్ట్రో బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ భీష్మ సినిమా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు కానీ ఈ ఇయర్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా గట్టి ఎదురుదెబ్బ కొట్టాయి, ప్రయోగాత్మక సినిమా చెక్ డిసాస్టర్ అవ్వగా హిట్ అవుతుంది అనుకున్న రంగ్ దే మంచి టాక్ తో కూడా భారీ నష్టాలను మిగిలించి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఫ్లాఫ్ గా నిలిచి భారీ ఎదురుదెబ్బ కొట్టింది నితిన్ కి.

ఇలాంటి టైం లో నితిన్ ఆశలు అప్ కమింగ్ మూవీ మీదే పెట్టుకున్నాడు… బాలీవుడ్ లో మూడేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధదూన్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాను వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా…

కృష్ణార్జున యుద్ధం సినిమాలు తీసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేయబోతుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మరింత ఆలస్యం కానుంది మేస్ట్రో సినిమా.

ఇక ఈ సినిమా ను తెలుగు లో భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్నారని తెలుస్తుంది, రెండు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడినా కానీ సినిమా ఒరిజినల్ సబ్జెక్ట్ భారీ విజయం సాధించడం తో ఆ కాన్ఫిడెంట్ తో నితిన్ ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ ను పెట్టారట ఈ సినిమా మీద… ఏకంగా 40 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు…

ఈ రేంజ్ బడ్జెట్ అంటే రిస్క్ అనే చెప్పాలి.. అందునా సినిమా కాన్సెప్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు… హీరో గుడ్డివాడిలా కనిపిస్తాడు, చాలా డిఫెరెంట్ గా సినిమా ఉంటుంది, మరి ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా తెలుగు లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి… త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫాం చేసే అవకాశం ఉందని సమాచారం…

Leave a Comment