న్యూస్

2 సార్లు 300…ఉస్తాద్ రామ్ క్రేజ్ కి రికార్డులు బద్దలు!!

టాలీవుడ్ హీరోలను హిందీ ఆడియన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. మన సినిమాలు అక్కడ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కష్టం కాబట్టి చాలా సినిమాలను డబ్ చేసి టెలివిజన్ లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, వాటికి రెస్పాన్స్ మరో లెవల్ లో వస్తూ ఉండటం తో మన హీరోల సినిమాలకు అక్కడ డిమాండ్ మరో లెవల్ కి చేరుకుంది. యంగ్ హీరోల్లో రామ్ మూవీస్ కి రెస్పాన్స్ అద్బుతంగా ఉంటూ వస్తుంది.

మొత్తం మీద రామ్ నటించిన సినిమాల్లో 6 సినిమాలకు హిందీ లో ఏకంగా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కగా అందులో ఇప్పుడు 2 సినిమాలు ఏకంగా 300 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డులు బద్దలు కొట్టింది. ఇలా 2 సార్లు 300 మిలియన్ మార్క్ ని…

ముందు బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక మరియు సీత సినిమాలతో సొంతం చేసుకోగా ఇప్పుడు రామ్ కూడా 2 సార్లు ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. రామ్ నటించిన నేను శైలజ మరియు ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే సినిమాలు అక్కడ 300 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాయి…

ఇక ఉన్నది ఒకటే జిందగీ సినిమా 200 మిలియన్ మార్క్ ని అందుకుంది. ఇక రామ్ మూవీస్ కి లైక్స్ పరంగా 1 మిలియన్ లైక్స్ ఏకంగా 4 సార్లు సొంతం అవ్వగా ఎక్కువ సార్లు ఇలా 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకున్న హీరోగా కూడా రికార్డ్ కొట్టాడు రామ్. ఇలా హిందీ లో కూడా తన క్రేజ్ ని పెంచుకుంటున్న రామ్…

లేటెస్ట్ గా రెడ్ మూవీ ని కూడా హిందీ లో డబ్ చేయగా రిలీజ్ అవ్వాల్సి ఉంది, ఇక రామ్ తన కొత్త సినిమాను లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు అండ్ తమిళ్ లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తో హిట్ కొడితే బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment