న్యూస్ బాక్స్ ఆఫీస్

2 సినిమాలకు ఇదేమి పరిస్థితి సామి….ఇది అస్సలు ఊహించలేదు!!

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఎందుకనో కొత్త సినిమాలకు ఆశించిన మేర కలెక్షన్స్ రావడం లేదు, జాతిరత్నాలు సినిమా సూపర్ సక్సెస్ తర్వాత బాక్స్  ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఏ సినిమా కూడా హిట్ గీతని దాటలేక పోయింది, కొన్ని సినిమాలు ఆశలు అంచనాలను రేపినప్పటికీ కూడా అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయాయి. ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పడ్డ…

వైల్డ్ డాగ్ మరియు సుల్తాన్ సినిమాలు రెండూ కూడా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కానీ రెండు సినిమాలు వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కంప్లీట్ గా చేతులు ఎత్తేశాయి. రీసెంట్ గా 5 వ రోజు రెండు సినిమాలు కూడా దారుణమైన డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి.

వైల్డ్ డాగ్ 5 వ రోజు 13 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా, మొత్తం మీద 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 2.85 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 3.24 కోట్ల షేర్ ని సాధించింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.4 కోట్లు కాగా సినిమా హిట్ అవ్వాలి అంటే…

మరో 6.16 కోట్ల  షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఉంది. అది దాదాపు అసాధ్యం కాబట్టి సినిమా డిసాస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక కార్తీ సుల్తాన్ సినిమా కూడా 5 వ రోజు కేవలం 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని సాధించగా… మొత్తం మీద 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా… 3.13 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా..

బ్రేక్ ఈవెన్ 6.5 కోట్లు అవ్వడంతో క్లీన్ హిట్ కి మరో 3.37 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… మొత్తం మీద రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేసి బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతాయి అనుకున్నా ఇప్పుడు రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించడం ఖాయంగా కనిపిస్తుంది.

Leave a Comment