గాసిప్స్ న్యూస్

2 సూపర్ హిట్ల హీరో…ఎవ్వరూ ముందుకు రావడం లేదు…మొట్టమొదటి హీరో కానున్న సాయి ధరం తేజ్!!

కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తర్వాత కెరీర్ లో సడెన్ గా డౌన్ ఫాల్ ని చూశాడు, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ బాక్ టు బాక్ హిట్స్ కొట్టి ఫాం అందుకున్నాడు.

ఇలాంటి టైం లో హాట్రిక్ పై కన్నేసి చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను సమ్మర్ రేసులో నిలపాలి కానీ కరోనా వలన కుదరలేదు, దాంతో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఆఫర్స్ బాగానే వచ్చినట్లే వచ్చి మళ్ళీ పే పెర్ వ్యూ పద్దతి అంటూ…

మెలిక పెట్టడం తో డౌట్ లోనే ఈ సినిమా నెల రోజులుగా మిగిలిపోయింది, కాగా రీసెంట్ గా సడెన్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకుందని అనౌన్స్ చేయగా సినిమా ఇప్పటికీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందా అన్నది…

క్లారిటీ లేకుండా ఉండగా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని సమాచారం. థియేటర్స్ ని రీ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ పర్మీషన్ ఇచ్చినా కొత్త సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడం తో థియేటర్ ఓనర్లు ఇంకా థియేటర్స్ ని మూసేసే ఉంచారు. దాంతో ఎవ్వరూ ముందుకు రాని టై లో ఇప్పుడు…

సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో థియేటర్స్ రీ ఓపెన్ అవ్వబోతుంది అని టాలీవుడ్ టాక్. నవంబర్ లో ఈ సినిమా తో థియేటర్స్ అన్నీ రీ ఓపెన్ కావచ్చు అంటున్నారు. ఇదే కనుక జరిగితే కరోనా తర్వాత థియేటర్స్ ని రీ ఓపెన్ చేయించిన ఘనత సాయి ధరం తేజ్ కే చెల్లుతుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Leave a Comment