న్యూస్ స్పెషల్

2.1 కోట్లతో 7.7 కోట్లు…సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి 11 ఏళ్ళు!

ఇప్పుడు చాలా వరకు సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ వస్తున్నాయి, స్ట్రైట్ మూవీస్ లో కూడా కొన్నే హిట్స్ గా నిలుస్తున్నాయి ఇక డబ్బింగ్ సినిమాలు ఎప్పుడో ఒకటి అరా తప్పితే హిట్ గీత దాటిన సినిమాలు చాలా తక్కువే ఉంటూ వస్తున్నాయి, కానీ ఇప్పటి తో పోల్చితే కొన్నేళ్ళ క్రితం లెక్క వేరుగా ఉండేవి, సినిమా కి టాప్ స్ప్రెడ్ అయితే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన…

సినిమాలు చాలా ఉండగా ఒక దశాబ్దం క్రితం వచ్చిన సినిమాల్లో రంగం, యముడు, ఇలా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ను బాగానే ఎలాయి, అలాంటి సినిమాల్లో మరో అద్బుతం కార్తీ తమన్నా ల కాంబినేషన్ లో రూపొందిన ఆవారా సినిమా. కంప్లీట్ గా రోడ్ జర్నీ నేపధ్యంలో రూపొందిన…

ఈ లవ్ స్టొరీ పాటలతో తెలుగు లో విపరీతమైన హైప్ ను సొంతం చేసుకుంది, రిలీజ్ కి ముందే వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేయడం తో ఆడియన్స్ లో మంచి అంచనాలు పెరిగి పోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత టాక్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పట్టినా…

ఆడియన్స్ సాంగ్స్ కోసమే థియేటర్స్ కి వచ్చేవాళ్ళు, ఆ రేంజ్ లో సాంగ్స్ హిట్ అవ్వడం సినిమా కి భారీగా హెల్ప్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ ను ఓ రేంజ్ లో సొంతం చేసుకుంది, కార్తీ రెండో సినిమానే కాబట్టి సినిమా కి తెలుగు లో అప్పుడే 2.1 కోట్ల రేటు ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

లాంగ్ రన్ లో ఏకంగా 7.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఏకంగా మూడు రెట్ల లాభాన్ని సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 11 ఏళ్ళు పూర్తీ చేసుకుంది రీసెంట్ గా… డబ్బింగ్ మూవీస్ లో కేవలం సాంగ్స్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఇది ముందు నిలిచే సినిమా…

Leave a Comment