న్యూస్ బాక్స్ ఆఫీస్

2.1 కోట్ల టార్గెట్…ఫస్ట్ డే వచ్చింది ఇది…ఇంత దారుణం ఏంటి సామి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మార్కెట్ ని చాలా వరకు కోల్పోయాడు సుమంత్, కెరీర్ లో ఎప్పుడూ ఒక హిట్ రెండు ఫ్లాఫ్స్ తో కెరీర్ ని కొనసాగించే సుమంత్ నటించిన రీసెంట్ మూవీస్ లో ఒక్క మళ్ళీ రావా మాత్రమే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మరీ అంతలా కాకున్నా రీసెంట్ గా వచ్చిన కపటధారి సినిమాకి కూడా పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మొదటి రోజు…

సినిమా కలెక్షన్స్ మాత్రం దిమ్మతిరిగేలా తక్కువగా వచ్చాయి, రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు సినిమా కనీసం 20 లక్షలకు తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని భావించినా కానీ సినిమా ఆ మార్క్ ని కూడా అందుకోలేక పోయింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా కేవలం 12 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా మొత్తం మీద 13 లక్షల షేర్ ని సొంతం చేసుకుని దారుణమైన ఓపెనింగ్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విచారకరం అనే చెప్పాలి.

సినిమా కి డిసాస్టర్ టాక్ వచ్చి ఉంటె అది వేరే కథ, కానీ డీసెంట్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ సినిమా అతి తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4L
👉Ceeded: 2L
👉UA: 2L
👉East: 1.6L
👉West: 0.6L
👉Guntur: 0.7L
👉Krishna: 0.5L
👉Nellore: 0.3L
AP-TG Total:- 0.12CR (0.2Cr Gross~)
ఇవీ మొత్తం మీద సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్. వరల్డ్ వైడ్ గా 13 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

మొత్తం మీద 1.9 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా 2.1 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా 1.97 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి వీకెండ్ లో సినిమా ఏమైనా గ్రోత్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి ఇక…

Leave a Comment