న్యూస్ బాక్స్ ఆఫీస్

2.25 రేటింగ్ తో 9 రోజుల్లో టార్గెట్ ఔట్….ఇది ఊహకందని భీభత్సం!!

రిలీజ్ అయినప్పుడు అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి నోటబుల్ సినిమాల మధ్య పోటిలో ఉంది కాబట్టి ఏమాత్రం తేడా కొట్టినా గట్టి దెబ్బ పడటం ఖాయం అనుకున్న టైం లో రివ్యూలు ఏమాత్రం అనుకూలంగా సొంతం చేసుకోలేక పోవడంతో ఇక సినిమా పని అయిపోయినట్లే అనుకున్న పెళ్లి సందD సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రివ్యూల ఇంపాక్ట్ మినిమమ్ కూడా చూపెట్టకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో…

కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసి మొదటి వారంలోనే బిజినెస్ కి దగ్గరగా రాగా రెండో వారంలో ఎక్స్ లెంట్ అనిపించుకునే రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా…

9 వ రోజు సాలిడ్ గ్రోత్ ని చూపెట్టి 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని సాధించి. 2-2.25 రేంజ్ రేటింగ్ తో క్లీన్ హిట్ గా నిలిచిన రేర్ మూవీస్ లో ఒకటిగా సంచలనం సృష్టించింది. ఒకసారి సినిమా…

టోటల్ గా 9 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.78Cr
👉Ceeded: 1.30Cr
👉UA: 80L
👉East: 42L
👉West: 34L
👉Guntur: 54L
👉Krishna: 38L
👉Nellore: 29L
AP-TG Total:- 5.85CR(9.60CR~ Gross)
Ka+ROI: 25L
OS – 8L
Total WW: 6.18CR(10.25CR~ Gross)
ఇదీ సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీద 5.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 18 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం ఇదే జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

Leave a Comment