టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

2.8 కోట్ల బడ్జెట్…160 థియేటర్స్ లో రిలీజ్…టోటల్ రన్ లో వచ్చింది ఇదీ…దారుణం ఇది!

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత ప్రతీ వారం కూడా లెక్కలు మించి సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. దాంతో కొన్ని సినిమాలు ఏమాత్రం ఆడియన్స్ రీచ్ ని కూడా అందుకోలేక పోతున్నాయి. దాంతో ఆ సినిమాలు రిలీజ్ అయిన విషయం కూడా తక్కువ మందికే తెలియడం తో ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపకుండానే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని పోతున్నాయి.

ఇప్పుడు ఈ కోవలోకే వచ్చే రీసెంట్ మూవీ తెల్లవారితే గురువారం మూవీ. మత్తు వదలరా సినిమా తో మంచి హిట్ కొట్టిన శ్రీ సింహా నటించిన రెండో సినిమా రోం కాం జానర్ లో తెరకెక్కగా అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేరని చెప్పొచ్చు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా 160 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మొదటి మూడు రోజుల వీకెండ్ లో ఎలాగోలా 19 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా అందులో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా కలిపి ఉన్నాయి. ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా మొత్తం మీద…

తెలుగు రాష్ట్రాలలో 26 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 30 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా ను ఆల్ మోస్ట్ 2.8 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించారు. బిజినెస్ ఏమి జరగక పోవడం తో ఓన్ గానే సినిమాను రిలీజ్ చేయగా బడ్జెట్ లో 10% కూడా రికవరీ చేయలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద బడ్జెట్ పరంగా భారీ డిసాస్టర్ గా నిలిచింది.

ఇక సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కి 1.2 కోట్ల వరకు రికవరీ అవ్వగా మొత్తం మీద అన్ని కలిపి చూసుకున్నా సినిమా ద్వారా ఆల్ మోస్ట్ 1.3 కోట్ల రేంజ్  నష్టం సొంతం అయ్యింది అని చెప్పాలి. మొదటి సినిమాతో మెప్పించినా రెండో సినిమా కి భారీ డిసాస్టర్ ను సొంతం చేసుకున్నాడు ఈ కొత్త కుర్రాడు…

Leave a Comment