న్యూస్ స్పెషల్

24 లో 20,00,000..రికార్డ్ ముక్క మిగల్లేదు!

సోషల్ మీడియా లో వచ్చే రికార్డులకు అంత ప్రాముఖ్యత ఉండదు కానీ అభిమానులు తమ అభిమానాన్ని చూపుకోవడానికి ఇదో వేదిక గా చేసుకుంటారు. ఒక్కో హీరో ఫ్యాన్స్ తమ హీరో పుట్టిన రోజులు కానీ ఫస్ట్ లుక్స్ కానీ ఇంకా ఎలాంటి అప్ డేట్ ని అయినా కానీ అందరికీ తెలిసేలా సెలెబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇక రీసెంట్ టైం లో వరుస హిట్స్ తో జోరు మీదున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మరో లెవల్ లో ఉంది.

అరవింద సమేత తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత చేస్తున్న సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత లేదన్నా మరో ఏడాదిన్నర అయినా సమయం పట్టే అవకాశం ఉండటం తో అప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాల గురించిన ప్రతీ అప్ డేట్ ని సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు కి 100 రోజుల ముందు సెలెబ్రేట్ చేసుకున్న అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి ఇతర హీరోల ఫ్యాన్స్ కి 24 గంటల విషయం లో అల్టిమేట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి దుమ్ము లేపారు.

ఇది వరకు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కి 100 రోజుల ముందు 550 వేల రేంజ్ లో ట్వీట్స్ పడగా తర్వాత ప్రభాస్ పుట్టిన రోజు కి 100 రోజుల ముందు ట్రెండ్ లో 6 లక్షల 25 వేల ట్వీట్స్ పడ్డాయి. అవి ఆల్ టైం రికార్డులుగా నిలవగా ఇప్పుడు ఆ రికార్డులకు ఏకంగా మూడు రెట్లు…

అంటే 24 గంటల్లో ఏకంగా 2 మిలియన్ ట్వీట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్ ను సెట్ చేశారు. ఈ క్రమం లో 16 గంటల పాటు ఇండియా లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేసి సంచలనం సృష్టించి సరికొత్త బెంచ్ మార్క్ ని ఇతర హీరోల ఫ్యాన్స్ కి టార్గెట్ గా పెట్టారు. మరి ఈ రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!