న్యూస్ స్పెషల్

20 నిమిషాల్లో 1 మిలియన్ ట్వీట్స్…ఆల్ టైం రికార్డ్!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ని తమ కంట్రోల్ లో పెట్టుకున్నారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సోషల్ మీడియా లో భారీ ఎత్తున ట్రెండ్ చేయడం మొదలు పెట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాత రికార్డుల బెండు తీస్తూ సరికొత్త రికార్డు లతో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సోషల్ మీడియా లో #HappyBirthdayNTR అంటూ ట్రెండ్ సాయంత్రం 6 గంటలకు మొదలు పెట్టగా…

మొదలు పెట్టిన 3 నిమిషాల టైం లోనే ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టగా వరల్డ్ వైడ్ గా 8 నిమిషాల లోపే టాప్ 16 ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం విశేషం, ఇక ట్విట్టర్ లో బర్త్ డే ట్రెండ్స్ తో పాటు అన్ని రకాల ట్రెండ్స్ విషయం లో…

ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ ని ఇండియా లో సొంతం చేసుకున్న ట్రెండ్ గా ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ ఆల్ టైం రికార్డ్ కొట్టింది, రీసెంట్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ట్రెండ్ లో 34 నిమిషాల్లో 1 మిలియన్ ట్వీట్స్ పడగా… ఆ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…

కేవలం 20 నిమిషాలకు అటూ ఇటూ గా సమయం లోనే ఏకంగా 1 మిలియన్ కి పైగా ట్వీట్స్ ని పోల్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేశారు, దాంతో పాత రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త సంచలన రికార్డ్ ను నమోదు చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మొత్తం మీద ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్విట్టర్ ట్రెండ్స్ విషయానికి వస్తే…

1. #HappyBirthdayNTR: 20Mins~
2. #8YrsOfGabbarSinghHysteria: 34mins
3. #HappyBirthdayPawanKalyan: 37m
4. #HBDJansenaniPawanKalyan: 48m
5. #14YearsForSouthIndiaIHPokiri: 53m
6. #NTRBdayFestBegins: 65M
7. #HappyBirthdaySSMB: 69M
ఇవీ టాప్ లో నిలిచిన ట్రెండ్స్. ఇక స్టార్టింగే ఈ రేంజ్ లో ఉంటే మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే సరికి సరికొత్త రికార్డులతో ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment