న్యూస్

20 నెలల రికార్డ్…జస్ట్ 1 గంటలో ఔట్…మెంటల్ మాస్ ఇది!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే, పోటిలో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్నా ఇప్పటికీ రేసులోనే నిలిచిన ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ నుండే హైప్ మరో లెవల్ లో సొంతం చేసుకుంది అని చెప్పాలి… రీమేక్ సినిమా నే అయినా కానీ ప్రతీ పోస్టర్ ప్రతీ అప్ డేట్…

సినిమా పై అంచనాలను ఎప్పటికప్పుడు భారీగా పెంచేస్తూ ఉండగా సినిమా గ్లిమ్స్ లో లాలా భీమ్లా థీమ్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సినిమా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అంటే అందరూ ఈ సాంగ్ నే అనుకున్నారు ఆ సాంగ్…

మరోటిగా డిసైన్ చేయగా ఆ సాంగ్ కూడా సాలిడ్ హిట్ అయింది, ఇక సినిమాలో ఈ థీమ్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఈ నెల 7 న ఫుల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పగా సాంగ్ ప్రోమోని దీపావళి కానుకగా రీసెంట్ గా రిలీజ్ చేశారు…

ఆ ప్రోమో చూస్తుంటే అంచనాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్ళేలా ఉన్నాయని చెప్పాలి, పవన్ కళ్యాణ్ లుక్ కానీ యాటిట్యూడ్ కానీ మాస్ కి పూనకాలు తెప్పించేలా ఉండగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత 20 నెలలుగా ఉన్న ప్రోమో రికార్డ్ ఒకటి బ్రేక్ చేసింది, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమాలోని సామజవరగమనా సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు….

24 గంటల్లో 209K లైక్స్ ని అందుకోగా ఆ రికార్డ్ 20 నెలలుగా మరే సినిమా సాంగ్ ప్రోమో కూడా అందుకోలేక పోయింది, కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ థీం సాంగ్ ప్రోమో కేవలం 1 గంటకి పైగా టైం తీసుకుని ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి 24 గంటల్లో ఊహకందని బెంచ్ మార్క్ ని ఇప్పుడు సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది.. మరి ఆ లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Leave a Comment