గాసిప్స్ న్యూస్

2014 బిగ్గెస్ట్ హిట్…ఇప్పుడు హిందీ లో రీమేక్!!

బాలీవుడ్ వాళ్ళు ఒరిజినల్ కథలను కంప్లీట్ గా పక్కకు పెట్టేసి ఇక సౌత్ రీమేక్ ల తోనే సరిపెట్టుకోవాలి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు, ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికే అనేక రీమేక్ లు అక్కడ రూపొందగా, అందరూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మరిన్ని రీమేక్ లను రూపొందిస్తూ పోతున్నారు బాలీవుడ్ వాళ్ళు, ఈ మధ్య ట్రోల్స్ మరింత పెరిగినా కానీ ఇప్పుడు మరిన్ని రీమేక్ లు…

అక్కడ ఒకటి తర్వాత ఒకటి రూపొందడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో 2014 లో టాలీవుడ్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమా కూడా రీమేక్ కి సిద్ధం అవుతుంది, కమర్షియల్ గా…

అన్ని హంగులు ఉన్న ఈ సినిమాను అప్పట్లోనే రీమేక్ కి ట్రై చేశారు కానీ ఎందుకనో వెనకడుగు వేశారు, కానీ ఇప్పుడు ఒరిజినల్ కథల కన్నా కూడా రీమేక్ అయితే అటు బాక్స్ ఆఫీస్ బిజినెస్, ఇటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ సాలిడ్ గా పలికే అవకాశం ఉండటం…

దానికి తోడూ రీమిక్స్ సాంగ్స్ తో మరింత క్రేజ్ పెంచుకోవడం లాంటి ఆప్షన్స్ ఉండటం తో రీమేక్ లనే నమ్ముకున్తున్నారు. కాగా రేసు గుర్రం సినిమా అల్లు అర్జున్ కెరీర్ టర్నింగ్ మూవీ అవ్వడమే కాకుండా కెరీర్ లో ఫస్ట్ 50 కోట్ల సినిమాగా నిలిచిన బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్.. అలాంటి ఈ సినిమాను అక్కడ రీమేక్ కి సిద్ధం చేస్తున్నా హీరోగా…

ఎవరు నటిస్తున్నారు అన్నది ఇంకా కన్ఫాం చేయాల్సి ఉంది. ఇక రీమేక్ కోసం ఏకంగా 3.5 కోట్ల దాకా రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఇక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేసిన రేసు గుర్రం బాలీవుడ్ లో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

Leave a Comment