న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

2016 లో బిచ్చగాడు….2019 లో ఖైదీ…ఇదేమి రచ్చ సామి!!

కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందు ఎంత సైలెంట్ గా రిలీజ్ అవుతాయో రిలీజ్ అయిన తర్వాత టాక్ కి అతీతంగా కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి సంచలనం సృష్టిస్తూ ఉంటాయి…. మన సినిమాలు అంటే ఓకే కానీ డబ్బింగ్ మూవీస్ తెలుగు లో క్రేజ్ నడుమ రిలీజ్ అయ్యే అంచనాలు తప్పుతున్న రోజుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా రీసెంట్ గా రిలీజ్ అయిన కార్తీ నటించిన లేటెస్ట్ సినిమా…

ఖైదీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి సంచలన వసూళ్ళ తో దూసుకు పోతుంది, సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ సంఖ్య పోటి లో ఉన్న విజిల్ తో పోల్చితే చాలా తక్కువే అయినా అద్బుతమైన మౌత్ టాక్ తో దూసుకు పోతున్న ఈ సినిమా…

వీకెండ్ తర్వాత ప్రతీ రోజు విజిల్ కన్నా మంచి వసూళ్ళనే సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా రిజల్ట్ చూస్తున్న వాళ్ళు అందరు 2016 లో ఇంతకన్నా భారీ రేంజ్ లో ఊచకోత కోసిన బిచ్చగాడు సినిమాతో ఈ సినిమా రన్ ని పోల్చుతున్నారు. ఆ సినిమా తో పోల్చితే ఇది అద్బుతమైన రన్ కాదు కానీ రిలీజ్ కి ముందు హైప్ లేకున్నా తర్వాత దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి.

2016 ఇయర్ లో సమ్మర్ లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 100 థియేటర్స్ లోనే రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా అద్బుతమైన మౌత్ టాక్ తో రోజు రోజు కి కలెక్షన్స్ పెంచుకుంటూ పోటి లో సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం ఉన్నా కానీ అల్టిమేట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుని…

ఏకంగా 16.5 కోట్ల వరకు షేర్ ని తెలుగు లో అందుకుంది, ఇప్పుడు ఆ రేంజ్ లో కాకున్నా ఖైదీ సినిమా కూడా తెలుగు లో అంచనాలు ఏమాత్రం లేని సమయం లో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ నే అయినా 6.6 కోట్లకు పైగా షేర్ ని అందుకుని వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ 8-9 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తుంది. మరి ఆ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. 

Leave a Comment