న్యూస్ స్పెషల్

2021 ఫస్టాఫ్ లో ఇండియా వైడ్ ట్రెండ్ అయిన టాప్ 10 హాష్ టాగ్స్ ఇవే!

2021 ఇయర్ ఆల్ మోస్ట్ 8 నెలలు గడిసింది అని చెప్పాలి. ఈ ఇయర్ ఇప్పటికే ఫస్ట్ వేవ్ తర్వాత భారీ లెవల్ లో సినిమాలు రిలీజ్ అవ్వడం చూశాం అలాగే సెకెండ్ వేవ్ ఇండియా లో ఆల్ టైం పీక్ స్టేజ్ కి వెళ్ళడం చూశాం. ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత మళ్ళీ సినిమాల రిలీజ్ లు జోరు అందుకోవడం కూడా చూస్తున్నాం. ఈ ఇయర్ ఇండియా సోషల్ మీడియా లో భారీ లెవల్ లో…

కొన్ని హాష్ టాగ్ లు సాలిడ్ గా ట్రెండ్ కూడా అయ్యాయి. ట్విట్టర్ ఇండియా అఫీషియల్ గా మొదటి 6 నెలల్లో ఎక్కువగా ట్రెండ్ అయిన హాష్ టాగ్స్ ని రిలీజ్ చేయగా వాటిలో 10 వ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ హాష్ టాగ్ ఉంది.

ఇక 9 వ ప్లేస్ లో #Covid19 హాష్ టాగ్ మీద సెకెండ్ వేవ్ టైం లో విపరీతంగా ట్వీట్స్ పడిన విషయం తెలిసిందే. ఇక 8 వ ప్లేస్ లో #BTS మ్యూజిక్ కంపెనీ మీద భారీగా ఇండియా లో కూడా ట్వీట్స్ పడటం విశేషం, ఇక 7 వ ప్లేస్ లో #Rubinadilaik హాష్ టాగ్ నిలిచింది.

ఇక 6 వ ప్లేస్ లో #Iheartawards హాష్ టాగ్ నిలిచింది. ఇక టాప్ 5 విషయానికి వస్తే #Thalapathy65 సినిమా హాష్ టాగ్ దుమ్ము లేపే రేంజ్ లో టాప్ 5 నిలిచింది. 4 వ ప్లేస్ లో అజిత్ కుమార్ పేరు ట్రెండ్ అయ్యి దుమ్ము లేపింది. ఇక టాప్ 3 లో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పేరు నిలిచింది.

ఇక టాప్ 2 ప్లేస్ లో విజయ్ మాస్టర్ సినిమా హాష్ టాగ్ ఫస్టాఫ్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యి దుమ్ము లేపగా, టాప్ ప్లేస్ లో అసలు రిలీజ్ కూడా కాకుండానే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న అజిత్ కుమార్ వలిమై హాష్ టాగ్ ఈ ఇయర్ ఫస్టాఫ్ కి గాను టాప్ ప్లేస్ లో నిలిచి దుమ్ము లేపింది. ఇక ఇయర్ ఎండ్ కి ఓవరాల్ గా ఏ హాష్ టాగ్ దుమ్ము లేపుతుందో చూడాలి.

Leave a Comment