న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

2021 లో టాలీవుడ్ లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు ఇవే!

2021 ఇయర్ మొదలు అయ్యి ఆగస్టు నెల తో ఆల్ మోస్ట్ 8 నెలలు కంప్లీట్ అయ్యాయి. మొదటి క్వార్టర్ లో అల్టిమేట్ అనిపించే లెవల్ లో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేసి దుమ్ము లేపాయి. కానీ తర్వాత సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో పరిస్థితులు మారిపోయి మళ్ళీ అన్ని థియేటర్స్ మూత బడగా మళ్ళీ జులై ఎండ్ నుండి థియేటర్స్ రీ ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక మొత్తం మీద…

ఈ ఇయర్ లో ఇప్పటి వరకు టాలీవుడ్ లో క్లీన్ హిట్ అయిన మూవీస్ ని ఆర్డర్ వైజ్ గమనిస్తే… క్రాక్ సినిమా ఈ ఇయర్ ఫస్ట్ హిట్ గా నిలవగా లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ అయింది, తర్వాత రెండో హిట్ గా డబ్బింగ్ మూవీ మాస్టర్ తెలుగు లో పోటి లో సూపర్ సక్సెస్ అయింది…

ఇక మూడో హిట్ రామ్ నటించిన రెడ్ ఫ్లాఫ్ తో సూపర్ హిట్ అయింది. ఇక 4 వ హిట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా యావరేజ్ టాక్ తో సూపర్ హిట్ అయింది. 5 వ హిట్ గా జాంబి రెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

6 వ హిట్ గా ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 7 వ హిట్ గా అల్లరి నరేష్ నాంది సినిమా సూపర్ హిట్ అవ్వగా 8 వ హిట్ గా జాతిరత్నాలు సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వగా తర్వాత 9వ హిట్ మూవీ గా SR కళ్యాణ మండపం సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను దక్కించుకుంది.

ఇక ఇప్పుడు 10 వ హిట్ గా రాజ రాజ చోర సినిమా నిలిచింది. వకీల్ సాబ్ సెమీ హిట్ గా నిలవగా కొన్ని సినిమాలు A1 ఎక్స్ ప్రెస్ తిమ్మరుసు లాంటి సినిమాలు ఎబో యావరేజ్ లో నిలిచాయి. ఇక ఇయర్ ఎండ్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి కచ్చితంగా మరిన్ని హిట్ మూవీస్ టాలీవుడ్ కి సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment