న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

2021 లో టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్!

2021 ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీ లను డామినేట్ చేస్తూ హైయెస్ట్ విజయాలతో దుమ్ము లేపుతూ రచ్చ లేపగా అదే టైం లో కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని కొన్ని సినిమాలు సొంతం చేసుకుని రచ్చ చేశాయి. రవితేజ క్రాక్ తో అదరగొడితే.. జాతిరత్నాలు సర్పైజ్ ఇవ్వడం, ఉప్పెన ఊహకందని సంచలనాలు, వకీల్ సాబ్ 2 వారాల రన్ కే దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

2021 ఇయర్ ఆగస్టు టైం నాటికి ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే… 11 వ ప్లేస్ లో అల్లుడు అదుర్స్ మూవీ 7.78 కోట్ల షేర్ ని అందుకుని టాప్ 11 లో ఉండగా 10వ ప్లేస్ లో…

కొత్త సినిమా SR కళ్యాణ మండపం ఇప్పుడు 8 కోట్ల షేర్ తో నిలిచింది… ఇక 9వ ప్లేస్ లో నితిన్ చెక్ మూవీ 9.35 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఉండగా 8 వ ప్లేస్ లో శర్వానంద్ శ్రీకారం సినిమా 9.64 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 7వ ప్లేస్ లో డబ్బింగ్ మూవీ మాస్టర్ 14.6 కోట్లతో ఉంది.

ఇక 6వ ప్లేస్ కి వస్తే నితిన్ రంగ్ డే సినిమా 16.51 కోట్లతో ఉండగా 5 వ ప్లేస్ లో రామ్ రెడ్ మూవీ 19.79 కోట్ల తో నిలిచింది. ఇక 4 వ ప్లేస్ లో జాతిరత్నాలు సినిమా 38.52 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది. 3 వ ప్లేస్ లో రవితేజ క్రాక్ సినిమా 39.16 కోట్ల షేర్ తో దుమ్ము దుమారం చేయగా… 2 వ ప్లేస్ లో ఉప్పెన సినిమా భీభత్సం సృష్టించి….

51.52 కోట్ల షేర్ తో ఓ సంచలనం సృష్టించింది. ఇక టాప్ ప్లేస్ లో అనేక అవరోధాలను కేవలం 2 వారల రేంజ్ లోనే రన్ ని సొంతం చేసుకున్న వకీల్ సాబ్ సినిమా 86.36 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ప్రస్తుతానికి ఇయర్ టాపర్ గా నిలిచింది. ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైం కి వకీల్ సాబ్ ని అందుకునే సత్తా ఏ సినిమాకైనా ఉందా లేదా అనేది చూడాలి ఇక…

Leave a Comment