న్యూస్ బాక్స్ ఆఫీస్

21 కోట్లు అవుట్…ఊరమాస్!!

యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి వసూళ్ళ ని సాధించి సంచలనం సృష్టించింది. సినిమా 6 కోట్ల రేంజ్ వసూళ్లు అనుకుంటే వరల్డ్ వైడ్ గా ఏకంగా 8 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా హైర్స్ కలిసి రావడం తో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా.. రెండో రోజు కూడా కుమ్మేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మంచి ఆక్యుపెన్సీ తో రన్ అయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షో లలో కూడా సూపర్బ్ ట్రెండ్ ని కొనసాగించింది. దాంతో రెండో రోజు కూడా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని నమోదు చేయబోతుంది.

ఓవరాల్ బుకింగ్స్ అండ్ నైట్ షోల స్టేటస్ తర్వాత సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.5 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని షేర్ ని అందుకోవచ్చు.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సినిమా గ్రాస్ మినిమమ్ 7 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉండగా 2 రోజుల గ్రాస్ లెక్కలు ఇప్పుడు 20 కోట్లు దాటి 21 కోట్ల మార్క్ రేంజ్ లో ఉండే చాన్స్ ఉంది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఇవి అద్బుతమైన కలెక్షన్స్ గా చెప్పుకోవచ్చు.

ఈ ఫిబ్రవరి నెలలో భీష్మ 2 రోజుల కలెక్షన్స్ ఏ టాప్ లో ఉండటం విశేషం. అన్ సీజన్ అయినా సాలిడ్ బ్యాటింగ్ ని కొనసాగిస్తున్న సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 12.5 కోట్ల రేంజ్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment