న్యూస్ బాక్స్ ఆఫీస్

23 కోట్ల సినిమా చేయని పని…4 కోట్ల సినిమా చేస్తుంది!!

ఒక సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా లేదా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్నా కానీ జనాలకు ఎంత ఎక్కువగా తెలుస్తుంది అన్న దాని మీదే సినిమా విజయావకాశాలు ఆధార పడి ఉంటుంది, ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసుకునే పరిస్థితులు ఏమాత్రం లేక పోవడం తో ఎక్కువగా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ నే సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఇది ఎక్కువగా ఉండగా సినిమాలను…

కొన్న వాళ్ళు యూనిట్ తో ప్రమోషన్ ని కూడా చేయించాలని చెప్పి మరీ సినిమాలను కొంటున్నారు, సౌత్ కి వచ్చే సరికి సినిమాల ప్రమోషన్ విషయం లో పెద్దగా జొష్ చూపరు కాబట్టి రేటు కొద్దిగా తగ్గించి ఇస్తున్నారు. ఇక లేటెస్ట్ గా తెలుగు లో 2 సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

అవే ఒకటి అనుష్క నటించిన నిశ్శబ్దం, మరోటి రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలు… ఈ రెండూ కూడా ఇప్పుడు అక్టోబర్ 2 న రిలీజ్ కానుండగా ఇందులో అనుష్క నిశ్శబ్దం సినిమా కి 23 కోట్ల రేటు పెట్టి అమెజాన్ ప్రైమ్ కొనగా రాజ్ తరుణ్…

ఒరేయ్ బుజ్జిగా సినిమా కి 4 కోట్ల రేంజ్ కి ఆహా వీడియో వాళ్ళు కొన్నారు… ఇక్కడ ప్రమోషన్ విషయానికి జనాలకు రీచ్ అయ్యే విషయానికి వస్తే నిశ్శబ్దం సినిమా కి పెట్టింది 23 కోట్లు అయినా జనాల్లో రీచ్ కానీ యూనిట్ ప్రమోషన్ కానీ చాలా నీరసంగా ఉందని చెప్పాలి. అదే సమయం లో రేటు చాలా తక్కువే అయినా…

ఒరేయ్ బుజ్జిగా సినిమా మాత్రం చాలా బాగా ప్రమోట్ చేసుకుంటూ 6 నెలల్లో మొట్ట మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సినిమాగా నిలిచింది. జనాల్లో ప్రస్తుతం ఎక్కువ రీచ్ మాత్రం ఒరేయ్ బుజ్జిగా సినిమాకే ఉందని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో అక్టోబర్ 2 న తేలనుంది…

Leave a Comment