న్యూస్ బాక్స్ ఆఫీస్

23 కోట్ల సినిమా…డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రేటు తెలిస్తే షాక్!!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా.. రామ్ న్యూ మూవీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరు తో రీమేక్ చేయగా సినిమాను ఈ ఇయర్ సమ్మర్ లోనే రిలీజ్ అనుకున్నా కానీ కరోనా వలన కుదరక పోవడం తో సినిమా లేట్ అవుతూ రాగా…

తర్వాత డైరెక్ట్ రిలీజ్ కి ప్లాన్ చేసినా వచ్చిన ఆఫర్లు నచ్చని రామ్ సినిమాను ఇక థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ చేయగా సినిమా ను వచ్చే సంక్రాంతి కి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫాం చేశారు. ఇక ఇంతటితో ఆగక సినిమా శాటిలైట్ రైట్స్ ని….

అలాగే డిజిటల్ రైట్స్ ని ఇప్పుడు అమ్మేశారు… సినిమా శాటిలైట్ రైట్స్ ని అలాగే డిజిటల్ రైట్స్ ని జెమినీ టీవీ సాలిడ్ రేటు ఇచ్చి హక్కులను సొంతంమ్ చేసుకుంది, సినిమా శాటిలైట్ రైట్స్ కి సుమారు 8.5 కోట్ల రేంజ్ రేటు దక్కగా సినిమా డిజిటల్ రైట్స్ ని…

సన్ నెక్స్ట్ యాప్ సుమారు 5 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది, దాంతో మొత్తం మీద ఈ రెండు కలిపే సినిమాకి 13.5 కోట్లకు అమ్మగా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ 23 కోట్ల రేంజ్ లో అవ్వగా అందులో చాలా మొత్తం ఇప్పటికే రికవరీ అవ్వగా ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉండగా సినిమాను మలయాళం లో కూడా డబ్ చేస్తున్నారు.

సో అక్కడ బిజినెస్ కూడా బాలెన్స్ ఉంది, ఇక సంక్రాంతికి థియేట్రికల్ బిజినెస్ ఎలానూ జరుగుతుంది, ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాకు అద్బుతమైన బిజినెస్ జరగడమే కాకుండా నిర్మాతకి సాలిడ్ గా ప్రాఫిట్స్ ని కూడా సొంతం చేసి పెట్టె అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment