న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

232 ఏంటి సామి….ఇండస్ట్రీ రికార్డులు చెల్లాచెదురు!!

టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. అత్యంత భారీ అంచనాల తో రూపొందుతున్న ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే, సినిమా రిలీజ్ ఈ ఇయర్ నుండి వచ్చే ఇయర్ సంక్రాంతి కి మారడం తో ఫ్యాన్స్ అయితే హార్ట్ అయ్యారు కానీ….

సినిమా కి ఇప్పుడు ట్రేడ్ లో అలాగే బయ్యర్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది, ఎంతలా అంటే సంక్రాంతి సీజన్ పైగా ఇద్దరు మాస్ హీరోలు… నంబర్ 1 డైరెక్టర్ దాంతో ముందు వెనకా చూసుకోకుండా ఇష్టం వచ్చిన రేటు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకోవాలని ఎగబడుతున్నారు.

ఈ క్రమం లో సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ చరిత్ర లోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం. అది టాలీవుడ్ చరిత్ర లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కళలో కూడా ఊహించని రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ గా చెప్పుకుంటున్నారు.

సినిమా ఏరియాల వారి బిజినెస్ ని గమనిస్తే
?Nizam: 85Cr
?Ceeded: 40Cr
?UA: 30Cr
?East: 18Cr
?West: 14Cr
?Guntur: 20Cr
?Krishna: 15Cr
?Nellore: 10Cr
AP-TG Total:- 232CR
రీసెంట్ టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్, బాహుబలి 2 కి 122 కోట్ల బిజినెస్, సాహో కి 121.6 కోట్ల బిజినెస్, సైరా కి 106.8 కోట్ల బిజినెస్ జరిగాయి.

వాటితో పోల్చితే ఇది ఆల్ మోస్ట్ డబుల్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ సంక్రాంతి బిగ్గీస్ రెండు సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో 242 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నాయి. ఈ లెక్కన ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ మమ్మోత్ బిజినెస్ ని వెనక్కి తేవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

Leave a Comment