న్యూస్ బాక్స్ ఆఫీస్

24 గంటలు ఓవర్…గోపీచంద్ సీటిమార్ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమాలే, కానీ గోపీచంద్ తో సాలిడ్ మూవీస్ ని చేస్తూనే ఉన్నారు నిర్మాతలు, ఇప్పుడు ఆ కోవలోనే మరోసారి భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న సినిమా సీటిమార్. అటు యాక్షన్ ఇటు స్పోర్ట్స్ ని మిక్స్ చేసి రూపొందిన ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

కాగా టీసర్ కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది అని చెప్పాలి. యాక్షన్ పార్ట్ రొటీన్ గోపీచంద్ మూవీస్ లో ఉన్నట్లుగానే అనిపించినా కానీ స్పోర్ట్స్ నేపధ్యం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా టీసర్ కి మొత్తం మీద మంచి రెస్పాన్స్ వచ్చింది.

మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ టీసర్ కి హైలెట్ గా నిలవగా తమన్నా వి రెండు మూడు షాట్స్ మాత్రమే చూపెట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2 న భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా…

అఫీషియల్ టీసర్ కి మొత్తం మీద 24 గంటల్లో 3.43 మిలియన్స్ అప్ డేట్ అయిన వ్యూస్ లభించగా లైక్స్ మొత్తం మీద 1 లక్షా 18 వేలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకుని మంచి రెస్పాన్స్ ని టీసర్ సొంతం చేసుకుంది, టీసర్ క్వాలిటీగా ఉండటం తో విజువల్స్ రిచ్ గా ఉండటం లాంటివి మంచి రీచ్ దక్కేలా చేశాయి. ఇక డైరెక్టర్ సంపత్ నంది రచ్చ తర్వాత…

గౌతమ్ నంద తో మెప్పించినా ఆశించిన విజయాన్ని అందుకోలేదు, మళ్ళీ గౌతమ్ నంద కాంబోలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుంది, గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ గా నిలుస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. అందరూ రీసెంట్ గా కంబ్యాక్ ఇస్తున్నారు, గోపీచంద్ కూడా ఇస్తారేమో చూడాలి..

Leave a Comment