న్యూస్ స్పెషల్

24 గంటలు ఓవర్…డబుల్ మార్జిన్ తో రికార్డులు అన్నీ ఔట్!!

సోషల్ మీడియా లో ఆల్ టైం బిగ్గెస్ట్ ట్రెండ్ ముగిసింది, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండేళ్ళు గా పెద్దగా సోషల్ మీడియా ట్రెండ్స్ చేయలేదు అన్న కసి తో ఎన్టీఆర్ 37 వ బర్త్ డే ట్రెండ్ ని ఆల్ టైం హిస్టారికల్ అనిపించే రేంజ్ లో నిర్వహించి ఎపిక్ రికార్డుల తో దుమ్ము దుమారం చేశారు, పాత రికార్డులు అన్నీ చెల్లా చెదురు అనిపించే రేంజ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

ఆర్ ఆర్ ఆర్ నుండి టీసర్ ఫస్ట్ లుక్ రాకున్నా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ అప్ డేట్ ఏం లేకున్నా కానీ జస్ట్ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తోనే సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ ట్రెండ్ ని 24 గంటల పాటు నిర్వహించి బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేశారు.

24 గంటల్లో ఇప్పటి వరకు ఎ ట్రెండ్ లో కూడా పోల్ కానన్ని ట్వీట్స్ తో ఏకంగా 21.5 మిలియన్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించి ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ని అందించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

మొత్తం మీద ఇండియా లో ఆల్ టైం బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ విషయానికి వస్తే… ఇది వరకు పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ లో 10.51 మిలియన్ ట్వీట్స్ పోల్ అవ్వగా ఆ రికార్డ్ ను డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించారు.

మొత్తం మీద ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెలకొల్పిన కొత్త రికార్డ్ పాత రికార్డ్ తో పోల్చితే డబుల్ మార్జిన్ తో ఉండటం ఇండియా వైడ్ గా కూడా బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ భారీ మార్జిన్ తో అందుకోవడం తో ఇక మీదట జరిగే హీరోల బర్త్ డే ట్రెండ్స్ లో ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారు అన్నది ఆసక్తి గా మారింది…

Leave a Comment