న్యూస్ స్పెషల్

24 గంటలు ఓవర్…..మాస్ రికార్డ్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా లోని మొదటి పాట మైండ్ బ్లాంక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా సాంగ్ మొత్తం మీద 24 గంటల పరంగా లిరికల్ సాంగ్స్ లో టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా కొత్త రికార్డ్ సాధించింది.

సినిమా సాంగ్ 24 గంటల్లో వ్యూస్ పరంగా 7.87 మిలియన్ వ్యూస్ ని అప్ డేటెడ్ వ్యూస్ గా సొంతం చేసుకుని ఇది వరకు రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లోని రాములో రాములా సాంగ్ రికార్డ్ 7.39 ని బ్రేక్ చేసింది.

అలాగే సౌత్ లో రీసెంట్ గా రజినీ కాంత్ మురగదాస్ ల దర్బార్ లోని మొదటి పాట 7.7 మిలియన్ వ్యూస్ ని అందుకోగా ఆ రికార్డ్ కూడా బ్రేక్ అవ్వగా ఓవరాల్ గా వ్యూస్ పరంగా సౌత్ లో సరికొత్త రికార్డ్ ఇప్పుడు నమోదు అయింది. 

కానీ లైక్స్ పరంగా 24 గంటల్లో కేవలం 1 లక్షా 33 వేల లైక్స్ ని మాత్రమె అందుకున్న ఈ సాంగ్ లైక్స్ విషయం లో ఎలాంటి రికార్డ్ ను అందుకోలేదు సరికదా టాప్ 5 లిరికల్ వీడియో లైక్స్ లో కూడా చోటు దక్కించుకోలేదు. 

ఓవరాల్ గా సాంగ్ కి కొంత మంది ఫాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ నుండి తప్పితే చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కిందని చెప్పొచ్చు. ఇక ఈ పాట థియేటర్స్ లో కచ్చితంగా దుమ్ము లేపుతుందని యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటం విశేషం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!