న్యూస్

24 గంటలు ఓవర్…రికార్డులు చెల్లాచెదురు….కానీ ఇదేంటి!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్ సినిమా అఫీషియల్ టీసర్ ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా టీసర్ కి అద్బుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది కానీ ఇనీషియల్ గా రికార్డుల విషయంలో మట్టుకు మరీ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేదు, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ పనుల్లో బిజీగా ఉండటం లాంటివి కూడా రికార్డుల విషయం లో ఇంపాక్ట్ అయ్యేలా చేశాయి.

కానీ టీసర్ రిలీజ్ అయిన 9 గంటల నుండి సినిమా టీసర్ కి వచ్చిన వ్యూస్ రేంజ్ మరో లెవల్ లో ఉందని చెప్పాలి. ఓ రేంజ్ లో రాంపేజ్ చూపెడుతూ గంట గంటకి మిలియన్స్ లో వ్యూస్ ని సొంతం చేసుకుంటూ పోయిన టీసర్ టాలీవుడ్ లో టీసర్ ల వ్యూస్…

రికార్డులను అన్నీ కూడా 13 గంటల లోపే టైం తీసుకుని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇక తర్వాత వ్యూస్ పరంగా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ పోయినా లైక్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ మినిమం ఇంపాక్ట్ ని కూడా చూపెట్టలేక పోయింది ఈ టీసర్….

మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి UV ఛానెల్ లో 42.67 మిలియన్ వ్యూస్ ని…493.5K లైక్స్ ని సొంతం చేసుకోగా T సిరీస్ ఛానెల్ లో 3.93 మిలియన్ వ్యూస్ ని అలాగే 345.6K లైక్స్ ని అందుకుంది. దాంతో ఓవరాల్ గా రెండు ఛానెల్స్ కలిపి ఈ టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్…

46.6 మిలియన్స్ వ్యూస్ ని అలాగే 839.1K లైక్స్ ని సొంతం చేసుకుని ఊచకోత అంటే ఇదే అనిపించుకుంది కానీ లైక్స్ పరంగా అక్కడ కూడా ఓవరాల్ గా నిరాశ పరిచింది. వ్యూస్ రికార్డ్ బెంచ్ మార్క్ ఊహకందని లెవల్ లో ఉన్నా లైక్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ ని అందుకోలేక నిరాశ పరిచింది. ఇక ఈ వ్యూస్ రికార్డ్ ను ఫ్యూచర్ లో అందుకునే టీసర్ ఏది అవుతుందో చూడాలి.

Leave a Comment