న్యూస్

24 గంటలు ఓవర్…రికార్డుల రాంపేజ్ ఇది!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ లవ్ స్టొరీ ఆడియన్స్ ముందుకు ఈ నెల 24 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కోసం చాలా మంది లాస్ట్ ఇయర్ నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే ముందు అఫీషియల్ ట్రైలర్ తో యూట్యూబ్ లో…

రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసింది. ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ టైర్ 2 హీరోల సినిమాల పరంగా హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను 6 గంటలకే బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా…

24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఏకంగా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడం తో పాటు టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ ట్రైలర్ లైక్స్ పరంగా కూడా టాప్ 5 లో ఒకటిగా నిలిచి అద్బుతమైన అచీవ్ మెంట్ ను సొంతం చేసుకుంది. లవ్ స్టొరీ ట్రైలర్ మొత్తం మీద….

24 గంటలు పూర్తీ అయ్యే టైం కి యూట్యూబ్ లో 5.31 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ 342K లైక్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. వ్యూస్ పరంగా అరణ్య 8.32M, వి మూవీ 7.45M, టక్ జగదీష్ 7.28M సీటిమార్ 6.54M సినిమాల తర్వాత ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. లైక్స్ పరంగా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా…

రెండో ప్లేస్ లో చెక్ 258K కన్నా సాలిడ్ లీడ్ ను సాధించింది. ఇక ఓవరాల్ టాలీవుడ్ టాప్ ట్రైలర్ లైక్స్ లో వకీల్ సాబ్ 1M, బాహుబలి 2 497K, సాహో 392K, సరిలేరు నీకెవ్వరు 347K ల తర్వాత ప్లేస్ లో నిలిచింది… ఓవరాల్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న లవ్ స్టొరీ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి….

Leave a Comment