న్యూస్

24 గంటలు ఓవర్…సడెన్ రిలీజ్…అయినా ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదు!!

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ… బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సింహా లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సినిమా చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత పోస్టర్స్ తో ఆ బజ్ ను అలానే కొనసాగిస్తూ రాగా రీసెంట్ గా ఉగాది కానుకగా సినిమా…

టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండబోతుంది అని చెప్పగా సడెన్ గా సినిమాలో కీలకమైన మరో క్యారెక్టర్ అయిన అఘోర రోల్ తాలుకూ లుక్ ని రివీల్ చేస్తూ చిన్న ఇంట్రో టీసర్ ను రిలీజ్ చేశారు. దాంతో ఆ లుక్ కి సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుండగా ఆ చిన్న గ్లిమ్స్ కి…

మొత్తం మీద యూట్యూబ్ లో రెస్పాన్స్ అదిరిపోయింది అనే చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో ఈ టీసర్ కి 7.35 మిలియన్స్ అప్ డేట్ అయిన వ్యూస్ అలాగే 245.8K లైక్స్ దక్కాయి. మొత్తం మీద మేకర్స్ రియల్ టైం వ్యూస్ 10 మిలియన్ మార్క్ ని అందుకుందని రిలీజ్ చేశారు.

దాంతో టాలీవుడ్ లో వచ్చిన టీసర్ ల పరంగా మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ల సరసన ఈ టీసర్ కూడా ఒకటిగా చేరింది. ఒకసారి ఆ లిస్టు ను గమనిస్తే…
👉#IntroducingPushpaRaj – 22.52M
👉#SarileruNeekevvaru- 14.64 M
👉#RamaRajuForBheem – 14.14M
👉#Saaho —12.94M
👉#Maharshi —11.14M
👉#BharatAneNenu- 8.67M
👉#VakeelSaab- 8.57M
👉#Acharya- 7.498M
👉#AKhanda- 7.35M****

ఇక టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఆచార్య టీసర్ కి 7.489 మిలియన్ వ్యూస్ దక్కగా ఇప్పుడు తర్వాత ప్లేస్ లో అఖండ నిలిచింది, కానీ ఇది అసలు టీసర్ కాదు. జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో టీసర్ అవ్వడం మెయిన్ టీసర్ రిలీజ్ అవ్వాల్సి ఉండటం విశేషం… ఓవరాల్ గా సడెన్ రిలీజ్ అయినా కానీ సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ టీసర్..

Leave a Comment