న్యూస్

24 గంటలు ఓవర్…సెన్సేషనల్ రెస్పాన్స్…టాప్ రికార్డ్ లేపేసిన రిపబ్లిక్ టీసర్!!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, జూన్ 4 న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా టీసర్ క్వాలిటీ అండ్ కంటెంట్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. సీరియస్ నోట్ తో సాగిన సినిమా టీసర్ సినిమా పై ఆసక్తిని…

మరింత పెంచింది అని చెప్పాలి. సాయి ధరం తేజ్ రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా వచ్చి మొదటి 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. సినిమా లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏవి…

క్రియేట్ చేయక పోయినా కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో కొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. మొత్తం మీద 24 గంటల్లో ఈ సినిమా కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 6.87 మిలియన్ మార్క్ ని అందుకోగా లైక్స్… 105.9K లైక్స్ ని అందుకుంది.

వ్యూస్ పరంగా ఇది వరకు విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ టీసర్ 6.36 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా ఆ రికార్డ్ కొంతకాలం అలానే ఉంది. ఇప్పుడు రిపబ్లిక్ టీసర్ బ్రేక్ చేసింది. ఒకసారి టాప్ లిస్టు ను గమనిస్తే
👉#Republic : 6.87M****
👉#WorldFamousLover: 6.36M
👉#TuckJagadish – 4.952M
👉#LoveStory – 4.92M
👉#Majili – 4.1 M
👉#RangDe: 4.1 M(2 Channels)
👉#VTeaser: 3.85 Mil
👉#GangLeader: 3.8M

మొత్తం మీద వ్యూస్ పరంగా దుమ్ము లేపినా లైక్స్ పరంగా టాప్ 5 లో చోటు సొంతం చేసుకోలేదు…ఇప్పటికీ లైక్స్ పరంగా వరల్డ్ ఫేమస్ లవర్ 2 లక్షల 68 వేల లైక్స్ తో టాప్ లో అలానే కొనసాగుతుంది, ఇక హాట్రిక్ విజయాలు అందుకున్న సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

Leave a Comment