న్యూస్

24 గంటల్లో టాలీవుడ్ టాప్ టీసర్ రికార్డులు ఇవే!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్ సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 24 గంటల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని, సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చప్పకనే చెప్పింది, ఇక టీసర్ క్వాలిటీ హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉండటం తో సినిమా కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా టీసర్ రిలీజ్ అయిన 24 గంటల్లో…

వ్యూస్ పరంగా సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేసింది… లైక్స్ పరంగా నిరాశ పరిచినా కానీ వ్యూస్ పరంగా ప్రీవియస్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి 24 గంటల్లో పాత రికార్డులతో పోల్చితే ఊహకందని కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి బిగ్గెస్ట్ టార్గెట్ ని పెట్టింది…

ఒక సారి టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన టాప్ టీసర్ లను గమనిస్తే…
👉#RadheShyam – 42.67M*****
👉#SarkaruVaariPaata: 23.06M
👉#IntroducingPushpaRaj – 22.52M
👉#SarileruNeekevvaru- 14.64 Mil+
👉#RamarajuForBheem- 14.14M
👉#Saaho—12.94 Mil
👉#Maharshi-11.14Mil
ప్రీవియస్ రికార్డ్ ను ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో దుమ్ము దుమారం చేసింది రాధే శ్యామ్ టీసర్…

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టీసర్ ల విషయానికి వస్తే…
👉#RamarajuForBheem – 940.3K
👉#IntroducingPushpaRaj – 793K~
👉#VakeelSaab – 776.9K
👉#SarkaruVaariPaata : 754.9
👉#Acharya – 516.5K
👉#BheemForRamaraju – 494K
👉#RadheShyam – 493.5K****
👉#Saaho – 455K
👉#Agnyaathavaasi-412K
లైక్స్ పరంగా మినిమం ఇంపాక్ట్ ని చూపలేక పోయిన టీసర్ టాప్ 5 లో కూడా చోటు దక్కించుకోలేదు… రెండేళ్ళ క్రితం వచ్చిన సాహో రేంజ్ లోనే…

ఓవరాల్ గా లైక్స్ వచ్చాయి. లైక్స్ విషయంలో గట్టి షాకిచ్చిన టీసర్ వ్యూస్ పరంగా మాత్రం రికార్డులను క్రియేట్ చేసింది. ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ రీసెంట్ టైం లో వ్యూస్ పరంగా రెట్టించిన జోరు చూపెడుతున్నాయి కానీ లైక్స్ పరంగా ఇంకా జోరు పెంచాల్సి ఉంది.. RRR లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రికార్డ్ ఏడాది అయినా ఇంకా టాప్ లో కొనసాగుతుంది, ఆ రికార్డ్ రాధే శ్యామ్ బ్రేక్ చేస్తుంది అనుకున్నా చేయలేదు. ఇక ఫ్యూచర్ లో వచ్చే టీసర్స్ లో ఏ టీసర్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Leave a Comment