న్యూస్ బాక్స్ ఆఫీస్

24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్…టైర్ 2 హీరోల రికార్డులు ఔట్…!!

26/11 దాడుల నేపధ్యంలో రూపొందిన సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లో మంచి హైప్ ను సొంతం చేసుకునేలా క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా అడివి శేష్ నటించిన మేజర్ మూవీ, తానె స్వయంగా స్టొరీ స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో రూపొందిచాలని ఫిక్స్ అవ్వగా ఆ దాడుల్లో స్వర్గస్తుడైన మేజర్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టొరీ గా మార్చి భారీ లెవల్ లో రూపోస్తున్నారు.

కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా సినిమా టీసర్ కి ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి… సినిమా టీసర్ కి అన్ని భాషల్లో కలిపి రియల్ టైం వ్యూస్ 12 మిలియన్స్ దాకా వచ్చాయి. ఇక 4 లక్షల 60 వేల దాకా..

లైక్స్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్ ఒక్క తెలుగు లోనే చూసుకుంటే 24 గంటల తర్వాత 4.29 మిలియన్స్ అప్ డేట్ వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ 293.4K లైక్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో టైర్ 2 హీరోల సినిమాల టీసర్ ల పరంగా హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను సాధించింది.

ఒకసారి టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న టైర్ 2 హీరోల టీసర్ లను గమనిస్తే..
👉#Republic : 6.87M
👉#WorldFamousLover: 6.36M
👉#TuckJagadish – 4.952M
👉#LoveStory – 4.92M
👉#Major – 4.29M***
👉#Majili – 4.1 M
ఇక టాప్ లైక్స్ లిస్టు ను గమనిస్తే
👉#Major – 293.4K****
👉#WorldFamousLover: 268K
👉#LoveStory – 265.7K
👉#RangDe: 191K(2 channels)
👉#TuckJagadish – 181.2K
👉#VTeaser: 181K

ఇవీ మొత్తం మీద 24 గంటల్లో ఈ టీసర్ సంచలన రికార్డులు, మొత్తం మీద సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్ ఇప్పుడు సినిమా పై ఉన్న అంచనాలను సాలిడ్ గా పెంచింది, బాలీవుడ్ లో మార్కెట్ స్టేబుల్ అయితే సినిమా కచ్చితంగా అక్కడ కూడా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment