న్యూస్

24 గంటల రికార్డ్…12.5 లో ఔట్….ఊహకందని ఊచకోత ఇది!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకేలకు సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు, కాగా సినిమా టీసర్ అనుకున్న టైం కన్నా ముందే లీక్ అవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ ఆఫ్ లైన్ సెలెబ్రేషన్స్ తో బిజీగా ఉండటం తో ఇనీషియల్ గా సినిమా టీసర్ రికార్డులను అందుకోలేక పోయింది.

దాంతో 9 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి ఓవరాల్ గా వ్యూస్ 12.5 మిలియన్ మాత్రమె రెండు ఛానెల్స్ కలిపి సొంతం అవ్వగా తర్వాత మొదలైంది అసలు రచ్చ, రాత్రికి రాత్రి వ్యూస్ మిలియన్స్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన ఈ టీసర్ టాలీవుడ్ లో ఇది వరకు…

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సర్కారు వారి పాట టీసర్ బ్లాస్టర్ పేరిట ఉన్న 23.05 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను కేవలం 12.5 గంటల టైం మాత్రమె తీసుకుని బ్రేక్ చేయగా ఆ జోరు అలానే కొనసాగి టాలీవుడ్ తరుపున కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తూ….

24 గంటల్లో ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో వ్యూస్ తో కొత్త రికార్డు ను ఇప్పుడు నమోదు చేయబోతుంది… కానీ అదే టైం లో లైక్స్ పరంగా ఇతర రికార్డ్ బ్రేకింగ్ మూవీస్ తో పోల్చితే సగం కూడా ఇంపాక్ట్ చూపలేక పోయింది రాధే శ్యామ్ టీసర్. దానికి కారణాలు ఏంటి అనేది తెలియదు కానీ ఓవరాల్ గా వ్యూస్ పరంగా మాత్రం….

సరికొత్త రికార్డులను టాలీవుడ్ లో నమోదు చేయబోతున్న ఈ సినిమా రికార్డ్ ను అందుకోవడం అప్ కమింగ్ మూవీస్ కి చాలా కష్టమే అని చెప్పే రేంజ్ లో బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది, ఇక లైక్స్ 24 గంటల్లో ఎంత వరకు పెంచుకుంటుందో అన్నది చూడాలి. 24 గంటల తర్వాత కంప్లీట్ రిపోర్ట్ ని అప్ డేట్ చేస్తాం…

Leave a Comment