గాసిప్స్ న్యూస్

25 కోట్లు ఏంటి సామి…షాకింగ్ అసలు!!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో హిట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో ఇప్పుడు నాగశౌర్య కూడా ముందు నిలుస్తాడు అని చెప్పాలి. కెరీర్ లో 19 సినిమాలు ఇప్పటి వరకు చేసిన నాగశౌర్య కేవలం కొన్ని సినిమాల తోనే తన మార్క్ ని చూపెట్టిన నాగశౌర్య అందులో కూడా ఛలో సినిమా తో మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు… తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా విజయాన్ని అందుకోలేదు.

ఈ ఏడాది ఎంతో ఆశపడి ఓన్ కథ తో చేసిన అశ్వద్ధామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సంక్రాంతి సినిమాల జోరు వలన ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయింది.

ఇలాంటి టైం లో తన లుక్ ని పూర్తిగా మార్చుకుని సిక్స్ ప్యాక్ తో కొత్త కాన్సెప్ట్ మూవీ తో రాబోతున్నాడు నాగశౌర్య. నార్త్ స్టార్ ప్రొడక్షన్ లో శరద్ మరార్ నిర్మాణంలో… సుబ్రమణ్యపురంను తెరకెక్కించిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో… తెరకెక్కుతున్న ఈ మూవీ ఆర్చరీ నేపధ్యంలో సాగే సినిమా అని అంటున్నారు.

కాగా ఈ సినిమా కోసం కేటాయించే బడ్జెట్ ఇప్పుడు టాక్ ఆఫ్ టౌన్ గా మారింది. ఏకంగా 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కాబోతుంది అని అంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య మార్కెట్ దృశ్యా ఈ రేటు ఆల్ మోస్ట్ డబుల్ అమౌంట్ అనే చెప్పాలి. మరి ఇంత రిస్క్ తీసుకోవడానికి రీజన్ సినిమా కథలో దమ్ము ఉండటం అనే అంటున్నారు.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా క్వాలిటీ అండ్ సెట్స్ భారీగా ఉండబోతుందని సమాచారం. అందుకోసమే ఈ రేంజ్ బడ్జెట్ అవసరం అవుతుందని అంటున్నారు. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో ఇంత బడ్జెట్ అంటే అది రిస్క్ అనే చెప్పాలి, మరి ఈ సినిమా తో అయినా నాగశౌర్య కెరీర్ టర్న్ అవుతుందో లేదో చూడాలి…

Leave a Comment