టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

25 కోట్ల సినిమా….టార్గెట్ 14…టోటల్ గా వచ్చింది ఇది!!

శర్వానంద్ సిద్దార్థ్ ల కాంబినేషన్ లో భారీగా తెరకెక్కిన సినిమా మహా సముద్రం, రిలీజ్ కి ముందు వరకు మంచి అంచనాలను క్యారీ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది కానీ దిగిన తర్వాత పరిస్థితులు టోటల్ గా మారిపోయి సినిమా డీసెంట్ అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్టలేక పోయింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 నుండే అంచనాలను అందుకునే కలెక్షన్స్ ని సాధించలేక పోయిన ఈ సినిమా వీకెండ్ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. దాంతో మొదటి వారం తర్వాత సినిమా థియేటర్స్ ని ఆల్ మోస్ట్ 80% వరకు తగ్గించేశారు…

ఇక రెండో వీక్ లో సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోవడం తో పరుగును చాలా త్వరగానే ముగించింది. సినిమా ను 25 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో మేకర్స్ సేఫ్ అయ్యారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ రన్ లో సాధించిన లెక్క ఈ విధంగా ఉంది…

👉Nizam: 1.98Cr
👉Ceeded: 1.19Cr
👉UA: 80L
👉East: 44L
👉West: 34L
👉Guntur: 57L
👉Krishna: 32L
👉Nellore: 27L
AP-TG Total:- 5.91CR(9.90CR~ Gross)
Ka+ROI: 23L
OS – 30L
Total WW: 6.44CR(11.25CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఫైనల్ కలెక్షన్స్…

సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 13.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 7.56 కోట్ల లాస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును ముగించింది. మేకర్స్ కి ప్రాఫిట్స్ వచ్చినా కొన్న బయర్స్ కి మాత్రం సినిమా భారీగా నష్టాలను సొంతం అయ్యేలా చేసింది..

Leave a Comment