న్యూస్ బాక్స్ ఆఫీస్

$25 మిలియన్ టార్గెట్…5 రోజుల్లో చైనాలో వచ్చింది తెలిస్తే షాక్!!

లాస్ట్ ఇయర్ ఇండియా లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా రోబో 2.0, శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సెన్సేషనల్ మూవీ అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయినా కానీ ఉన్నంతలో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. కాగా శంకర్ ఈ సినిమా రూపొందించే సమయం లో ఇండియా వరకే కాకుండా చైనా లో కూడా భారీ గా రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకునే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విషయం లో ఏమాత్రం రాజీ పడలేదు.

కాగా సినిమా ఇండియా మొత్తం మీద విజయం సాధించినా అది సినిమా బడ్జెట్ రేంజ్ 550 కోట్ల తో పోల్చితే మామూలు విజయం అనే చెప్పాలి. కానీ సినిమా చైనా లో ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అక్కడ మంచి వసూళ్లు వస్తాయని నిర్మాతలు భావించి ఉంటారు.

రీసెంట్ గా సినిమా ను చైనా లో రిలీజ్ చేశారు, ఒకటి కాదు 2 కాదు ఏకంగా 48,000 వేల స్క్రీన్స్ లో ఇండియన్ సినిమా హిస్టరీ లోనే చైనా లో ఏ సినిమా రిలీజ్ అవ్వని రేంజ్ లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా, ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో అని అంతా ఎదురు చూస్తుండగా 5 రోజుల్లో సినిమా అక్కడ సాధించిన కలెక్షన్స్ ఇవి…

👉Day 1: $1.37M
👉Day 2: $0.72M
👉Day 3: $0.39M
👉Day 4: $0.18M
👉Day 5: $0.15M
Total 5 days: $2.93 Million[₹ 22 Crs]
👉Break Even: $25Mil….కాగా సినిమాని ఎంతకి అమ్మారు అన్నది క్లియర్ గా రివీల్ చేయక పోయినా కానీ బ్రేక్ ఈవెన్ కి మాత్రం… అక్కడ 25$ మిలియన్ డాలర్స్ వసూల్ చేయాలట.

కానీ 5 రోజుల్లో ఎంత కష్టపడ్డా వచ్చింది కేవలం 3 మిలియన్ కూడా లేకపోవడం తో అక్కడ రోబో 2.0 భారీ డిసాస్టర్ అని తేల్చేశారు. ఇదే సమయం లో అక్కడ బాహుబలి టైప్ సినిమాలు ఎన్నో వచ్చినా బాహుబలి 2 కి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కాయి. కానీ 2.0 మాత్రం భారీ నష్టాలను అక్కడ సొంతం చేసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయిపొయింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!