గాసిప్స్ న్యూస్

25 రోజులే…కాచుకోండి అంటున్న వెంకీ….టాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

మల్టీ స్టారర్ మూవీస్ తో పాటు సోలో మూవీస్ తో ఫుల్ బిజీగా దూసుకు పోతున్నాడు విక్టరీ వెంకటేష్, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఎఫ్ 2, వెంకిమామ మల్టీ స్టారర్ మూవీస్ తో బాక్ టు బాక్ దుమ్ము లేపిన వెంకీ, ఇప్పుడు తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాను తెలుగు లో నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా ఎండ్ కి రాగా…

రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 3 తో సందడి చేయబోతున్న వెంకీ ఈ సినిమాను ఆగస్టు లో రిలీజ్ కి సిద్ధం చేస్తూ ఉండగా సడెన్ గా ఇప్పుడు కొత్త సినిమాను కమిట్ అవ్వడం జరిగిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మలయాళంలో…

అక్కడ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దృశ్యం సినిమా కి సీక్వెల్ దృశ్యం 2 డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఎపిక్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా తెలుగు రీమేక్ అన్ని రీమేక్ లలోకి ముందుగా మొదలు కాబోతుండగా…

అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమాను అతి తక్కువ టైం లో కంప్లీట్ చేసి త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని యూనిట్ పక్కా ప్లానింగ్ లో ఉన్నారు, కాగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమా కోసం మొత్తం మీద ఇచ్చిన కాల్ షీట్స్ 25 రోజులు అని ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అంటే సినిమాలో వెంకీ పార్ట్ షూటింగ్ మొత్తం మీద…

25 రోజుల్లో కంప్లీట్ కానుండగా అదే టైం లో ఇతర యాక్టర్స్ షూటింగ్ కూడా అవుతుందని, మొత్తం మీద సినిమా 25 నుండి 30 రోజుల వర్కింగ్ డేస్ లో కంప్లీట్ అవుతుందని అంటున్నారు, దాంతో టాలీవుడ్ ఈ న్యూస్ విని ఇంత తక్కువ టైం లో కంప్లీట్ చేస్తారా అని ఆశ్యర్య పోతూ ఉండగా సినిమాను అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ సెకెండ్ ఆఫ్ లో లేదా జులై లో రిలీజ్ చేస్తారని కూడా టాక్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Leave a Comment