న్యూస్ బాక్స్ ఆఫీస్

250 కోట్ల రేటు…జీ కి ఎంత నష్టం వచ్చిందో తెలిస్తే షాకే!!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే… బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా పే పెర్ వ్యూ పద్దతి లో సినిమా 249 టికెట్ రేటు తో రిలీజ్ ను సొంతం చేసుకోగా 11 రోజుల పాటు అలా కంటిన్యూ అయిన ఈ సినిమా తర్వాత…

కంప్లీట్ గా డిజిటల్ ప్లాట్ ఫాం లో రిలీజ్ అయింది. కాగా 11 రోజుల్లో సినిమా కి పే పెర్ వ్యూ పద్దతి లో మొత్తం మీద 275 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అన్నీ కలుపుకుని సొంతం అయినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 18 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుందని సమాచారం. దాంతో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 293 కోట్ల గ్రాస్ ని టోటల్ గా సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమా ను జీ నెట్ వర్క్ వాళ్ళు కంప్లీట్ గా 250 కోట్ల భారీ రేటు చెల్లించి అన్ని హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా సినిమా కి 275 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఇండియా లో వచ్చినప్పటికీ కూడా అందులో నెట్ కలెక్షన్స్ లెక్క మాత్రం 45% కట్ అవుతుందని అంటున్నారు. అంటే సినిమా ఎంటర్ టైన్ మెంట్ టాక్సులు OTT లో టికెట్ రేటు తో రిలీజ్ అయిన సినిమాలకు కూడా ఉంటుందట.. ఆ లెక్కన 275 కోట్లలో సగం అంటే…

145 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ మాత్రమే సినిమా ఓవరాల్ గా OTT లో రికవరీ చేసిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో 250 కోట్ల రేటు కి OTT ద్వారా వచ్చిన కలెక్షన్స్ కాకుండా మరో 105 కోట్లు రికవరీ అవ్వాల్సి ఉందని ఇక శాటిలైట్ రైట్స్ ద్వారానే అది ఎంతవరకు రికవరీ అవుతుంది అనేది ఆసక్తి కరమని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment