గాసిప్స్ న్యూస్

250 కోట్ల సినిమా నుండి 75 కోట్ల రేంజ్…మామూలు దెబ్బ కాదిది!!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ దెబ్బ కి బాలీవుడ్ లో పెను మార్పులు రాబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా నెపోటిజం పై తీవ్రంగా వ్యతికేకత ఉన్న నేపధ్యం లో స్టార్ కిడ్స్ మూవీస్ పై ఇంపాక్ట్ సాలిడ్ గా ఉండబోతుండగా… అది అప్ ప్రజెంట్ మూవీస్ తో పాటు తర్వాత మొదలు కావాల్సిన కొత్త సినిమా ల పై కూడా గట్టి ఇంపాక్ట్ ని చూప నున్నాయి అని చెప్పాలి.

ముఖ్యంగా ఎక్కువగా స్టార్ కిడ్స్ తోనే సినిమాలు తీసే టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపధ్యం లో ఇప్పటికే తన నిర్మాణం లో వచ్చిన సినిమాలకు ఇంపాక్ట్ గట్టిగా తలగడం తో తను లాస్ట్ ఇయర్ చివర్లో మొదలు పెట్టాల్సిన భారీ సినిమాను…

కరణ్ జోహార్ అఫీషియల్ గా ఆపేశాడు ఇప్పుడు… రణవీర్ సింగ్, ఆలియా భట్, కరీనా కపూర్, విక్కీ కౌశల్, భూమీ పడ్నేకర్, జాన్వి కపూర్ మరియు అనిల్ కపూర్ తో ప్లాన్ చేసిన 250 కోట్ల భారీ బడ్జెట్ మూవీ “తక్త్” ని అఫీషియల్ గా కాన్సిల్ చేసి మరో ప్లాన్ వేశాడు…

సుశాంత్ ఫ్యాన్స్ కి భయపడి ఇలా చేశారు అని అంతా అనుకుంటున్న సమయంలో కరణ్ జోహార్ ఆ సినిమా ప్లేస్ లో మళ్ళీ స్టార్ కిడ్స్ తోనే సినిమా చేయబోతున్నాడట. ఆలియా భట్ మరియు రణవీర్ సింగ్ ల కాంబినేషన్ లో ఒక లవ్ స్టొరీ నితీయాలని డిసైడ్ అయిన కరణ్ జోహార్ రీసెంట్ గా ఆ సినిమాను అనౌన్స్ చేశాడు.

ఆలియా భట్ మరియు రణవీర్ సింగ్ ల కాంబినేషన్ లో “రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని” అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేయగా ఈ సినిమా బడ్జెట్ సుమారు 75 కోట్లతో నిర్మాణం కాబోతుందని సమాచారం. 250 కోట్ల రేంజ్ బడ్జెట్ తో బాహుబలి లెవల్ లో సినిమా అనుకుంటే ఫ్యాన్స్ దెబ్బకి రూట్ మార్చి 75 కోట్లతో లవ్ స్టొరీ తో సరిపెట్టుకుంటున్నాడు కరణ్ జోహార్ ఇప్పుడు.

Leave a Comment