టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

26 కోట్ల బడ్జెట్, 400 థియేటర్స్ లో రిలీజ్….20 కోట్ల బిజినెస్…వచ్చిన కలెక్షన్స్ ఇవి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ ఫస్ట్ వేవ్ తర్వాత పరిస్థితులు అన్నీ నార్మల్ అవుతాయి అనుకుంటున్న టైం లో మిగిలిన ఇండస్ట్రీలు దాదాపు కోలుకుని సూపర్ హిట్స్ తో జోరు చూపుతున్న టైం లో బాలీవుడ్ వాళ్ళు మాత్రం సినిమాలు లేక హిట్స్ లేక ఏడాదికి పైగా టైం ను ఖాళీగానే గడిపారు. ఇలాంటి టైం లో ఒక చిన్న సినిమా వాళ్లకి మంచి హోప్స్ నే ఇచ్చింది అని చెప్పాలి…

ఆ సినిమానే జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన రూహి అనే హర్రర్ కామెడీ మూవీ… స్త్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మొత్తం మీద 26 కోట్ల బడ్జెట్ లో రూపొందగా సినిమా ఇండియా లో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.

సినిమా మొత్తం మీద 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను కూడా సొంతం చేసుకోగా 40 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో 15 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా, టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా మొత్తం మీద మరో…

7 కోట్ల కలెక్షన్స్ ని యాడ్ చేసింది. దాంతో పరుగు కంప్లీట్ అయ్యే టైం కి ఈ సినిమా 22 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల టార్గెట్ కి 22 కోట్ల కలెక్షన్స్ తో 18 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును ముగించిందని సమాచారం. కానీ పాండమిక్ తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి…

ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఫస్ట్ మూవీ ఇదే అవ్వడం తో తర్వాత కొన్ని ఇతర సినిమాలు కూడా ధైర్యం చేసి సినిమాలను రిలీజ్ చేసినా ఫలితం మాత్రం శూన్యమే అయింది. మొత్తం మీద బిజినెస్ పరంగా బడ్జెట్ పరంగా భారీ డిసాస్టర్ అయిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రూపంలో మట్టుకు 35 కోట్ల రేటు సొంతం చేసుకుని సేఫ్ అయ్యింది.

Leave a Comment