న్యూస్ బాక్స్ ఆఫీస్

28 కోట్లు…టాలీవుడ్ కూడా షాకయ్యింది….ఏంటి సామి ఇది!!

అనుకున్నవి అనుకున్నట్లు జరిగేవి కొందరికే…బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడతాయి అనుకున్న సినిమాలు నీరుగారి పోయినవి ఎన్నో ఉన్నాయి, ఈ సినిమా ఆడదు అనుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయినవి ఎన్నో ఉన్నాయి. కొందరు సినిమా ల పరంగా అంచనాలను అందుకుంటే కొందరు అందుకోలేక పోతారు. రీసెంట్ గా ఇలానే కొన్ని సినిమాలు ఆడియన్స్ ముందుకు అంచనాల అందుకునే ప్రయత్నం చేసినా తీవ్రంగా నిరాశ పరిచి డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ కూడా ఇదే కోవలోకి చేరే సినిమాగా మారబోతుంది. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది.

మూడో రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని 27 లక్షల షేర్ నే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అవ్వడానికి సిద్ధం అయ్యింది, సినిమా డైరెక్ట్ రిలీజ్ కోసం భారీ ఆఫర్స్ వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ అయితే ఏకంగా 28 కోట్ల…

భారీ రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది, అప్పుడే టాలీవుడ్ షాకయ్యింది… ఈ రేంజ్ రేటు అంటే కచ్చితంగా నాగార్జున ఓకే చెబుతారు అనుకున్నా, నాగార్జున మాత్రం ఆ ఆఫర్ కి నో చెప్పి సినిమాను కొన్ని సెంటర్స్ లో ఓన్ గా రిలీజ్ చేసి మొత్తం మీద 8.9 కోట్ల రేటు కి అమ్మాడు. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ కింద మరో 10 కోట్లు ఇప్పుడు సినిమా సొంతం చేసుకుందట.

అంటే మొత్తం మీద థియేటర్స్ లో రిలీజ్ కి ఒప్పుకున్నందుకు సినిమా 19 కోట్ల లోపే బిజినెస్ ను సాధించింది, బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది. అదే 28 కోట్ల రేటు కి ఓకే చెప్పి ఉంటె డిజిటల్ రైట్స్ కింద మరో 5-7 కోట్లు అయినా దక్కేవి. అప్పుడు 35కోట్ల బిజినెస్ ను అందుకునేది. కానీ ఇప్పుడు సినిమా నాగార్జున అంచనాలను అందుకోలేక పోయింది.

Leave a Comment