గాసిప్స్ న్యూస్

3 ఏళ్ల క్రితం ఫ్లాఫ్ అయిన సినిమా…2020 లో ప్రశంసల జల్లు!

  కొన్ని సినిమా లు రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆకట్టు కోవు, బజ్ పెద్ద గా లేక పోవడం వలనో, ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ లేక పోవడం వలనో, రిలీజ్ అయ్యి యావరేజ్ రివ్యూ లు సొంతం చేసు కోవడం వలన కావచ్చు, అనేక రీజన్స్ వలన ఒకప్పుడు థియేటర్స్ లో చూసినప్పుడు నచ్చని సినిమా లు తర్వాత టీవీ లో చూసినప్పుడో లేక స్ట్రీమింగ్ యాప్స్ లో చూసినప్పుడు నచ్చుతూ ఉంటాయి.

అలాంటి కోవలోకే ఇప్పుడు ఓ చిన్న హీరో నటించిన సినిమా వస్తుంది, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన కొన్ని సినిమా లు థియేట్రికల్ రిలీజ్ ని దక్కించుకోలేదు, కొన్ని రిలీజ్ అయిన వెంటనే పరుగు ను ముగించాయి, ఈ కోవలోకే వస్తుంది తమిళ్ లో చేసిన…

మాయావన్ అనే సినిమా, ఇదే సినిమా తెలుగు లో ప్రాజెక్ట్ Z అనే పేరుతో డబ్ అయింది, రెండు చోట్ల కూడా రిలీజ్ అయిన మొదటి వారానికే పరుగు ను కంప్లీట్ చేసుకుంది, తెలుగు లో అయితే రిలీజ్ అయినట్లు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి ఈ సినిమా మూడేళ్ళ క్రితం…

వచ్చింది అన్న విషయం కూడా తక్కువ మందికే తెలుసు, రిలీజ్ అయిన మూడేళ్ళ తర్వాత డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తమిళ్ వర్షన్ కి సోషల్ మీడియా లో సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. సైంటిఫిక్ క్రైం థ్రిల్లర్ స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీ ష్రాఫ్ లాంటి…

మంచి స్టార్ ఉన్నారు, తెలుగు లో డిజిటల్ మాస్టర్ ప్రింట్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ తమిళ్ వర్షన్ నే చూస్తున్న చాలా మంది సినిమా ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలా థియేట్రికల్ రిలీజ్ సమయం లో సరిగ్గా ప్రమోట్ చేసుకోక తర్వాత ఇలా డిజిటల్ రిలీజ్ తర్వాత ప్రశంసలు అందుకున్న సినిమా లలో ఒక్కటిగా ఈ సినిమా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. వీలు కుదిరితే మీరు సినిమా ను ఒక సారి చూడండి…

Leave a Comment