గాసిప్స్ న్యూస్

3 ఏళ్ల క్రితం మూవీ…15 కోట్ల బడ్జెట్…ఇప్పటికే తగ్గింది అంటే…ఇంకా తగ్గించారు!!

మాస్ మూవీస్ తో ఒక ఊపు ఊపిన హీరోల్లో గోపీచంద్ కూడా ఒకరు, యజ్ఞం, ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం, గోలీమార్ మరియు లౌక్యం లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్న గోపీచంద్ రీసెంట్ మూవీస్ మాత్రం అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కొటిగా నిరాశ పరుస్తూ నష్టాలను మిగిలిస్తున్న విషయం తెలిసిందే, అయినా కానీ తన కొత్త సినిమాలకు మినిమమ్ 20 కోట్ల రేంజ్….

బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటూ రాగా, తను చేసిన సినిమాలో రిలీజ్ కాకుండా అనుకోని అవరోధాలను ఎప్పటికప్పుడు ఎదురు కుంటూ అలాగే పోస్ట్ పోన్ అవుతున్న సినిమా గా ఆరడుగుల బులెట్ సినిమా ని చెప్పుకోవచ్చు. ఎప్పుడో మూడేళ్ళ క్రితమే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా…

అనేక సార్లు పోస్ట్ పోన్ అవ్వగా ఇక రిలీజ్ అవ్వదు అనుకున్న టైం లో త్వరలో రిలీజ్ అనే పోస్టర్ రావడం మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం జరగగా ఈ సినిమా ని రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తారు అన్న టాక్ రాగా బడ్జెట్ దృశ్యా రేటు చాలా తక్కువ ఆఫర్…

వచ్చినా తర్వాత శాటిలైట్ రైట్స్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ తో పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవచ్చు అనుకోగా సినిమా కి రేటు 6-7 కోట్ల రేంజ్ లో వచ్చింది. కానీ అప్పుడు ఏమి చెప్పలేదట యూనిట్, రీసెంట్ గా మరోసారి కొత్త ఆఫర్స్ తో OTT వాళ్ళు రాగా రేటు మరింత తగ్గించి చెప్పారని అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం సినిమాకి 4 నుండి 4.5 కోట్ల రేంజ్ లో ఆఫర్ ఇవ్వగలమని అంటున్నారట. కానీ సినిమా బడ్జెట్ ఏకంగా 15 కోట్లు అవ్వడం తో ఈ రేటు ఏమాత్రం గిట్టుబాటు కాదనే చెప్పాలి. దాంతో యూనిట్ ఇప్పటికీ ఫైనల్ నిర్ణయం ఏం తీసుకోవాలో అన్న మీమాంస లో ఉందని సమాచారం….

Leave a Comment